Pub Notices : విరాట్ పబ్‌కు నోటీసులు
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:50 AM
ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌కు బెంగళూరు నగరపాలక సంస్థ (బీబీఎంపీ) నోటీసులు జారీ చేసింది. చిన్నస్వామి స్టేడియం
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌కు బెంగళూరు నగరపాలక సంస్థ (బీబీఎంపీ) నోటీసులు జారీ చేసింది. చిన్నస్వామి స్టేడియం దగ్గరల్లోని రత్నం కాంప్లెక్స్ ఆరో అంతస్థులో ఈ పబ్ కమ్ రెస్టారెంట్ ఉంది. అయితే, ఫైర్ సేఫ్టీ విభాగం నుంచి ఎన్‌వోసీ తీసుకోకుండానే పబ్‌ను నడుపుతున్నారంటూ సామాజిక కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. దీనిపై నోటీసులిచ్చినా పబ్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో తాజాగా బీబీఎంపీ మరోసారి నోటీసులు జారీ చేసింది. వారం రోజులలోపు వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.