Share News

దక్షిణాఫ్రికా భారీస్కోరు

ABN , Publish Date - Oct 31 , 2024 | 01:15 AM

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను 575/6 స్కోరుతో డిక్లేర్‌ చేసిన సఫారీలు..ఆపై బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో...

దక్షిణాఫ్రికా భారీస్కోరు

బంగ్లాతో రెండో టెస్ట్‌

చటోగ్రామ్‌ (బంగ్లాదేశ్‌): బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను 575/6 స్కోరుతో డిక్లేర్‌ చేసిన సఫారీలు..ఆపై బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో రెండోరోజు ఆఖరికి నాలుగు వికెట్లు పడగొట్టారు. 38/4తో తీవ్ర ఇక్కట్లలో కూరుకుపోయిన ఆతిథ్య జట్టు..ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 537 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 307/2తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టులో మల్డర్‌ (105 నాటౌట్‌) శతకంతో చెలరేగాడు.

Updated Date - Oct 31 , 2024 | 01:15 AM