Share News

Border-Gavaskar Trophy : ‘బాక్సింగ్‌ డే’కు సన్నాహాలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 06:56 AM

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీ్‌సలో కీలకమైన బాక్సింగ్‌ డే టెస్ట్‌కు వేళవుతోంది. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీ్‌సలో భారత్‌-ఆస్ట్రేలియా ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఈనెల 26న

Border-Gavaskar Trophy : ‘బాక్సింగ్‌ డే’కు సన్నాహాలు

ప్రాక్టీస్‌ ప్రారంభించిన టీమిండియా

మెల్‌బోర్న్‌: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీ్‌సలో కీలకమైన బాక్సింగ్‌ డే టెస్ట్‌కు వేళవుతోంది. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీ్‌సలో భారత్‌-ఆస్ట్రేలియా ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఈనెల 26న మొదలయ్యే నాలుగో టెస్ట్‌ ఇరు జట్లకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. వచ్చే గురువారం నుంచి జరిగే ఈ టెస్ట్‌కు భారత జట్టు సన్నాహకాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా శనివారం సాధన మొదలు పెట్టింది. ముఖ్యంగా బౌలర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. పేస్‌ దళపతి బుమ్రా, సిరాజ్‌, హర్షిత్‌ రాణా, నితీశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ నెట్స్‌లో సుదీర్ఘ సమయం గడిపారు. ‘కష్టపడడానికి ఎలాంటి ప్రత్యామ్నాయాలుండవు. బాక్సింగ్‌ డే టెస్ట్‌కు భారత బౌలర్లు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు’ అని బౌలర్ల సాధన వీడియోను విడుదలజేస్తూ బీసీసీఐ పేర్కొంది.

రాహుల్‌కు గాయం ?

బౌలర్లతోపాటు బ్యాటర్లు కూడా సాధనలో పాల్గొన్నారు. అయితే బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ అనంతరం ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ చేతికి ఫిజియో చికిత్స చేయడం కనిపించింది. దాంతో రాహుల్‌ గాయపడ్డాడనే ఆందోళన వ్యక్తమైంది. టెస్ట్‌కు మరో నాలుగు రోజుల సమయం ఉండడంతో అప్పటికల్లా కోలుకుంటాడని భావిస్తున్నారు.

ఎంసీజీలో ‘బ్లూస్టాండ్‌’ అలజడి

లక్ష మంది సామర్థ్యం కలిగిన మెల్‌బోర్న్‌ స్టేడియంలో నాలుగో టెస్ట్‌కు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా స్టేడియంలోని ‘బ్లూ స్టాండ్‌’ వద్ద పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. ఆ స్టాండ్‌లో ఉండే అభిమానులు మద్యం సేవించి విపరీతంగా ప్రవరిస్తుంటారట. ప్రత్యర్థి జట్టు ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వాళ్లు చేయాల్సిందంతా చేస్తారని మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌ భద్రతా సిబ్బంది ఒకరు చెప్పాడు. షేన్‌ వార్న్‌ ఎండ్‌వైపు ఉండే ఆ బ్లూస్టాండ్‌లో ఆరు బ్లాకులుంటాయి. బాక్సింగ్‌ డే టెస్ట్‌..తొలి రోజు ఆటకు లక్షకు..లక్ష టిక్కెట్లు అమ్ముడు పోయాయి. దీంతో బ్లూస్టాండు కూడా పూర్తిగా నిండిపోతుందని, అందులో ఫ్యాన్స్‌ ప్రవర్తన చాలా దూకుడుగా ఉంటుందని ఆ భద్రతా సిబ్బంది తెలిపాడు. సాధారణంగా మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో జరిగే మ్యాచ్‌లకు బౌండరీ లైన్‌ వద్ద 10 మంది గార్డులను నియమిస్తారు. అయితే ఈ నాలుగో టెస్ట్‌కు మాత్రం 15 మందిని ఏర్పాటు చేస్తున్నారని అతడు చెప్పాడు.

సచిన్‌ రికార్డుపై కోహ్లీ గురి

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్న కోహ్లీ..సచిన్‌ మరో రికార్డుకు చేరువయ్యాడు. ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌లో 449 రన్స్‌తో..అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌ రికార్డు టెండూల్కర్‌ పేరిట ఉంది. ఇక ఇప్పటి వరకు మూడు టెస్ట్‌ల్లో 316 పరుగులు చేసిన కోహ్లీ..సచిన్‌ రికార్డుకు 133 పరుగుల దూరంలో ఉన్నాడు.

ఆసీస్‌ మీడియా అతి

భారత జట్టు ఎంసీజీలో శనివారం సాధన చేసింది. ఆ సందర్భంగా భారత్‌నుంచి వెళ్లిన మీడియా ప్రతినిధులతో జడేజా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఈక్రమంలో స్టేడియంలో ఉన్న కొందరు ఆస్ట్రేలియా విలేకరులు జడేజా వద్దకు వచ్చారు. కేవలం భారత మీడియా కోసమే ఆ సమావేశమని, ఇతర జర్నలిస్టులకు కాదని జట్టు మీడియా మేనేజర్‌ చెప్పినా వినలేదు. భారత విలేకరుల ప్రశ్నలకు హిందీలో బదులిచ్చిన జడేజా.. సమయం అయిపోవడంతో అక్కడ నుంచి వెనుదిరిగాడు. కానీ ఆస్ట్రేలియా మీడియా ప్రతినిధులు..జడేజా తమ ప్రశ్నలకు ఇంగ్లి్‌షలో సమాధానమివ్వలేదంటూ గొడవ చేశారు.

Updated Date - Dec 22 , 2024 | 06:56 AM