Share News

Carabao Cup: కరబావో కప్‌లో బ్రెంట్‌ఫోర్డ్, షెఫీల్డ్ మ్యాచ్ డ్రా.. పెనాల్టీ షూట్‌లో గెలుపెవరిదంటే

ABN , Publish Date - Oct 30 , 2024 | 10:56 AM

పాపులర్ ఫుట్‌బాల్ లీగ్ ‘కరబావో కప్’లో బ్రెంట్‌ఫోల్డ్ జట్టు క్వాటర్ ఫైనల్‌కు చేరింది. షేఫీల్డ్‌పై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో విక్టరీ కొట్టి నాకౌట్ దశకు చేరుకుంది.

Carabao Cup: కరబావో కప్‌లో బ్రెంట్‌ఫోర్డ్, షెఫీల్డ్ మ్యాచ్ డ్రా.. పెనాల్టీ షూట్‌లో గెలుపెవరిదంటే
Brentford vs Sheffield

ఇంగ్లండ్‌లో ప్రతి ఏడాది జరిగే జాతీయ స్థాయి ఫుట్‌బాల్ లీగ్ ‘కరబావో కప్’లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. బ్రెంట్‌ఫోర్డ్, షెఫీల్డ్ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్దేశిత సమయంలో ఇరు జట్లు 1-1 సమాన గోల్స్ చేయడంతో మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే క్వాటర్ ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన పెనాల్టీ షూటౌట్‌లో బ్రెంట్‌ఫోర్డ్ అదరగొట్టింది. పెనాల్టీ షూటౌట్‌లో 5-4 తేడాతో గెలుపొందింది.


ఈ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్‌గా కొనసాగింది. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. బ్రెంట్‌ఫోర్డ్‌కు ఆడుతున్న జర్మనీ స్ట్రైకర్ కెవిన్ గోల్ ప్రయత్నాలను ప్రత్యర్థి జట్టు గోల్ కీపర్ పీయర్స్ ఛార్లెస్ విజయవంతంగా నిలువరించాడు. లెవిస్-పోట్టర్, బ్రయాన్ వంటి స్టార్ ప్లేయర్ల ప్రయత్నాలను కూడా19 ఏళ్ల చార్లెస్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. పలు ప్రయత్నాల అనంతరం ఎట్టకేలకు కెవిన్ ఒక గోల్ సాధించాడు. అప్పటికే షెఫీల్డ్ కూడా ఒక గోల్ చేసి ఉండడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన బ్రెంట్‌ఫోర్డ్ జట్టు లీగ్‌లో క్వాటర్ ఫైనల్‌కు చేరింది.


ఇవి కూడా చదవండి

న్యూక్లియర్ డ్రిల్‌ మొదలు పెట్టిన రష్యా.. ఏం జరగబోతోంది

ఇరాన్‌కు సంచలన వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్.. టెన్షన్ టెన్షన్

పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణలు.. కారణం ఎందుకంటే..

నవంబర్‌లో బ్యాంకులకు చాలా హాలిడేస్.. ఎప్పుడెప్పుడంటే

ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు


For more Business News and Telugu News

Updated Date - Oct 30 , 2024 | 11:01 AM