Shooting : షూటింగ్ వరల్డ్‌కప్‌లో సిఫ్ట్‌కు కాంస్యం
ABN , Publish Date - Jun 08 , 2024 | 05:53 AM
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్ర కాంస్యం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ పోటీల్లోని మహిళల 50 మీటర్ల రైఫిల్ 3పీలో సిఫ్ట్ 452.9 పాయింట్లు స్కోరు
మ్యూనిచ్: ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌క్‌పలో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్ర కాంస్యం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ పోటీల్లోని మహిళల 50 మీటర్ల రైఫిల్ 3పీలో సిఫ్ట్ 452.9 పాయింట్లు స్కోరు చేసి తృతీయ స్థానంలో నిలిచింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సరబ్‌జోత్ స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో మొత్తంగా భారత్ రెండే పతకాలను సాధించింది.