Share News

Jasprit Bumrah: బుమ్రా నెంబర్ 1.. తొలి భారత పేసర్‌గా రికార్డు

ABN , Publish Date - Feb 08 , 2024 | 06:13 AM

ఇంగ్లండ్‌తో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రాకు తగిన రివార్డు లభించింది. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాబితాలో...

Jasprit Bumrah: బుమ్రా నెంబర్ 1.. తొలి భారత పేసర్‌గా రికార్డు

టెస్ట్‌ ర్యాంకుల్లో అగ్రస్థానం

ఈ ఘనత అందుకున్న తొలి భారత పేసర్‌గా రికార్డు

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రాకు తగిన రివార్డు లభించింది. బుధవారం ప్రకటించిన ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాబితాలో 30 ఏళ్ల బుమ్రా అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. తద్వారా టెస్ట్‌ల్లో నెం.1 ర్యాంక్‌ కైవసం చేసుకున్న తొలి భారత పేసర్‌గా రికార్డు సృష్టించాడు. ఈక్రమంలో కమిన్స్‌, రబాడ, అశ్విన్‌ను బుమ్రా వెనక్కు నెట్టాడు. అలాగే టాప్‌ర్యాంక్‌కు ఎగబాకిన నాలుగో భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. గతంలో అశ్విన్‌, జడేజా, బిషన్‌ సింగ్‌ బేడీకి నెం.1 ర్యాంక్‌ లభించింది. విశాఖ టెస్ట్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన బుమ్రా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యా చ్‌’గా నిలిచిన విషయం విదితమే. ఇక..11 నెలలపాటు సుదీర్ఘంగా టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అశ్విన్‌ (841 పా యింట్లు) ఆ హోదాను బుమ్రా (881 పాయింట్లు)కు కోల్పోయాడు. అశ్విన్‌ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. అశ్విన్‌, జడేజా 2017లో సం యుక్తంగా నెం.1 ర్యాంక్‌లో ఉన్న అరుదైన ఘనత దక్కించుకున్నారు.

జైస్వాల్‌.. 37 స్థానాలు పైకి..

బ్యాటింగ్‌ విభాగంలో..భారత యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ ఏకంగా 37 స్థానాలు ఎగబాకాడు. ఇంగ్లండ్‌తో విశాఖ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో దుమ్ము రేపిన జైస్వాల్‌ 29వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో తిరిగి ఫామ్‌లో కొచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ 14 స్థానాలు మెరుగుపరుచుకొన్నాడు. కెరీర్‌లో అత్యుత్తమంగా 38వ ర్యాంక్‌ను అతడు చేజిక్కించుకున్నాడు.

Updated Date - Feb 08 , 2024 | 08:21 AM