Share News

రోహిత్‌, ద్రవిడ్‌లకు సియెట్‌ అవార్డులు

ABN , Publish Date - Aug 22 , 2024 | 06:40 AM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సియెట్‌ క్రికెట్‌ అవార్డులను అందుకున్నారు. ‘ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌’ పురస్కారం రోహిత్‌కు, ‘జీవిత సాఫల్య’ అవార్డును

రోహిత్‌, ద్రవిడ్‌లకు సియెట్‌ అవార్డులు

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సియెట్‌ క్రికెట్‌ అవార్డులను అందుకున్నారు. ‘ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌’ పురస్కారం రోహిత్‌కు, ‘జీవిత సాఫల్య’ అవార్డును ద్రవిడ్‌కు ప్రదానం చేశారు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ‘ఉత్తమ వన్డే క్రికెటర్‌’గా ఎంపికయ్యాడు. ‘వన్డే ఉత్తమ బౌలర్‌’ అవార్డు షమిని, ‘ఉత్తమ టెస్ట్‌ బ్యాటర్‌’ పురస్కారం యశస్వీ జైస్వాల్‌ను వరించాయి. అశ్విన్‌కు ‘ఉత్తమ టెస్ట్‌ బౌలర్‌’ అవార్డు దక్కింది. ‘ఉత్తమ క్రీడా పరిపాలకు’డిగా జై షా ఎంపికయ్యాడు. భారత మహిళల జట్టు వైస్‌కెప్టెన్‌ మంధాన ‘ఉత్తమ భారత బ్యాటర్‌’గా, దీప్తిశర్మ ‘ఉత్తమ భారత బౌలర్‌’గా అవార్డులు స్వీకరించారు. టీ20లలో అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించినందుకు హర్మన్‌ప్రీత్‌కు, టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ చేసిన షఫాలీ వర్మకు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథి శ్రేయాస్‌ ‘అత్యుత్తమ కెప్టెన్‌’గా మెమొంటోలు అందజేశారు.

Updated Date - Aug 22 , 2024 | 06:40 AM