Share News

హైబ్రిడ్‌ మోడల్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ?

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:19 AM

వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడం దాదాపుగా ఖరారైంది. ఈమేరకు ఐసీసీ, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది...

హైబ్రిడ్‌ మోడల్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ?

  • ఏకాభిప్రాయానికి ఐసీసీ, పీసీబీ!

  • ఫ 2027 వరకు ఇదే విధానం

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడం దాదాపుగా ఖరారైంది. ఈమేరకు ఐసీసీ, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 2027 వరకు ఇదే తరహాలో టోర్నీలు నిర్వహించేందుకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అంటే, చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ తమ మ్యాచ్‌లను తటస్థ వేదిక దుబాయ్‌లో ఆడనుంది. దీని ప్రకారం ఐసీసీ ఈవెంట్ల కోసం భారత జట్టు పాక్‌కు వెళ్లదు..అలాగే పాక్‌ జట్టు కూడా భారత్‌కు రాదు. దుబాయ్‌లో గురువారం ఐసీసీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐసీసీ చైర్మన్‌ జైషాతో సభ్యుల చర్చలు ఫలించాయని సమాచారం.


శనివారం జరిగే బోర్డు మీటింగ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ గురించి చర్చించే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ‘2026 పురుషుల టీ20 వరల్డ్‌క్‌పలో పాక్‌ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించనున్నారు. చాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తే నష్టపరిహారం కోసం పాక్‌ చేస్తున్న డిమాండ్‌ ఇంకా పరిశీలనలో ఉంద’ని ఐసీసీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 06 , 2024 | 05:36 AM