Share News

వరుసగా ఆరో డ్రా

ABN , Publish Date - Dec 06 , 2024 | 05:20 AM

వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో భారత జీఎం గుకేష్‌, డిఫెండింగ్‌ చాంప్‌ డింగ్‌ లిరేన్‌ (చైనా) మధ్య గురువారం జరిగిన తొమ్మిదో రౌండ్‌ గేమ్‌ కూడా ఫలితం తేలలేదు..

వరుసగా ఆరో డ్రా

  • సమంగా గుకేష్‌, లిరెన్‌

సింగపూర్‌: వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో భారత జీఎం గుకేష్‌, డిఫెండింగ్‌ చాంప్‌ డింగ్‌ లిరేన్‌ (చైనా) మధ్య గురువారం జరిగిన తొమ్మిదో రౌండ్‌ గేమ్‌ కూడా ఫలితం తేలలేదు. 54 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లూ పాయింట్‌ పంచుకొన్నారు. టోర్నీలో ఇది ఏడో డ్రా కాగా.. వరుసగా ఆరోది. దీంతో గుకేష్‌, లిరెన్‌ చెరో 4.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. విజేతగా నిలవాలంటే ఇం కా 3 పాయింట్లు సాధించాల్సి ఉండగా.. మరో 5 రౌండ్లు మిగిలున్నాయి. మిగిలిన 5 రౌండ్లలో లిరెన్‌ మూడుసార్లు తెల్లపావులతో ఆడనున్నాడు.

Updated Date - Dec 06 , 2024 | 05:20 AM