Share News

Hardik Pandya: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న ముంబై జట్టు.. ఆ ప్లేయర్ కోసం ఎమోషనల్ మెసేజ్

ABN , Publish Date - Dec 02 , 2024 | 12:58 PM

ఐపీఎల్ 2025 వేలంలో ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అందులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ ఉన్నారు. కానీ, తుఫాన్ వేగంతో ఎగిసిపడే ఓపెనర్‌ను మాత్రం వదిలేసింది...

Hardik Pandya: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న ముంబై జట్టు.. ఆ ప్లేయర్ కోసం ఎమోషనల్ మెసేజ్
Mumbai Indians

ముంబై: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ విధ్వంసకర ఆటగాడిని వదులుకుని ముంబై ఇండియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు జట్టులో ఉన్న సమయంలో ఏకంగా ఐదుసార్లు ఈ ఫ్రాంచైజీ టైటిల్ గెలుచుకుంది. అతడే ఇషాన్ కిషాన్. ఆ తర్వాత వేలంలోనూ ముంబై జట్టు అతడిని కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. వేలంలో అతడి ధర రూ. 3 కోట్లు పలకగానే అక్కడితో ఈ జట్టు బిడ్డింగ్ ప్రయత్నాలు మానుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కోసం పట్టుబట్టింది. ఏకంగా రూ.11.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, వదిలేసుకున్న తర్వాత ఇషాన్ విషయంలో ముంబై జట్టు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ట్విట్టర్‌లో ఓ వీడియోను సైతం పంచుకుంది. ఇందులో ఇషాన్ అట్టిపెట్టుకునేందుకు ప్రయత్నించినా అది కుదరలేదంటూ హార్దిక్ పాండ్యా వివరించాడు. చివరి సారిగా తమ జట్టు ఆటగాడికి వీడ్కోలు సందేశం పంపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


ముంబై ఇండియన్స్‌ను వీడిన తర్వాత హార్దిక్ పాండ్యా ఇషాన్ కిషన్‌కు వీడ్కోలు సందేశం ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ పాకెట్ డైనమోగా ఇషాన్‌ని హార్దిక్ అభివర్ణించాడు. ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరపున 6 సంవత్సరాలు ఐపీఎల్ ఆడుతున్నాడని మీకు తెలియజేద్దాం. 2018 నుండి 2024 వరకు IPL సమయంలో అతని ఉనికిలో, ముంబై జట్టు రెండుసార్లు టైటిల్ గెలుచుకుంది.


‘‘మాకు ముందే తెలుసు ఇషాన్ కిషన్ ను రిటైన్ చేసుకోలేకపోతే అతడిని ఈ వేలంలో తిరిగి పట్టుకోవడం కష్టమని.. ఎందుకంటే అరుదైన నైనుణ్యాలున్న క్రికెటర్ అతడు. మెగా వేలంలో అతడి కోసం గట్టి పోటీ ఉంటుంది. ఇక ముంబయి జట్టుకి పాకెట్‌ డైనమైట్‌లాంటి ఆటగాడు కిషన్‌. ముంబై జట్టుతో ఆరేళ్ల పాటు పనిచేశాడు. ఆ సమయంలో రెండు సార్లు ముంబై ఇండియన్స్ టైటిల్‌ను గెలుచుకుంది. కిషన్ ఎప్పుడూ సరదాగా ఉంటాడు. అందర్నీ నవ్విస్తుంటాడు. అతడికి ఎదుటివారిని గేలి చేయడం తెలియదు. స్వచ్ఛమైన ప్రేమ ఇషాన్ సొంతం. తనను మేమెంతో మిస్సవుతున్నాం. అతడని ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తుంటాం అంటూ పాండ్యా ఓ ఎమోషనల్ వీడియోను షేరు చేశాడు.

Mohammad Shami: ఆ సెర్టిఫికెట్ ఉంటేనే షమీకి ఎంట్రీ.. బీసీసీఐ కొత్త మెలిక


Updated Date - Dec 02 , 2024 | 12:59 PM