Team India: టీమిండియాకి ప్యాకేజీ స్టార్.. అలాంటి క్రికెటర్ ప్రపంచంలోనే లేడు: ఇంగ్లండ్ దిగ్గజం
ABN , Publish Date - Dec 02 , 2024 | 10:43 AM
ఆతిథ్య జట్టుకు పెర్త్ లో మ్యాచ్ లు గెలవడం వెన్నతో పెట్టిన విద్య అలాంటిది తమకు ఏమాత్రం అనుభవం లేని పెర్త్ వేదికపై సునాయాసంగా మ్యాచ్ ను ఎగరేసుకుపోవడం చూసి షాకయ్యానంటూ....
ముంబై: ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ అందరి ప్రశంసలు అందుకుంది జస్ప్రీత్ బుమ్రా పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన తర్వాత. ఆసిస్ తో తొలి టెస్టులో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన బుమ్రా ఎనిమిది వికెట్లు పడగొట్టి చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతడి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అంటూ బుమ్రాను ఆకాశానికెత్తాడు.
“జైస్వాల్ అద్భుతంగా 161 పరుగులు చేశాడు. కానీ నా దృష్టిని విపరీతంగా ఆకర్షించిన టీమిండియా క్రికెటర్ మాత్రం బుమ్రానే. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే బుమ్రా అత్యుత్తమ ఆటగాడు. అతడ్ని పడగొట్టే ఆటగాడు నాకు తెలిసి మరెవ్వరూ లేరు. అతడి బౌలింగ్ చూడటం నాకెంతో సంతృప్తినిచ్చింది. థాంక్ గాడ్.. అతడిని ఎదుర్కొనే అవకాశం నాకు లేదు అని తెలిపాడు. ఆస్ట్రలియాపై భారత ఆటగాళ్ల ప్రదర్శన తననెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఆతిథ్య జట్టుకు పెర్త్ లో మ్యాచ్ లు గెలవడం వెన్నతో పెట్టిన విద్య అలాంటిది తమకు ఏమాత్రం అనుభవం లేని పెర్త్ వేదికపై సునాయాసంగా మ్యాచ్ ను ఎగరేసుకుపోవడం నాకు షాకింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా సొంత గడ్డపై ఓడిన మ్యాచ్ లు చాలా తక్కువ. భారత జట్టు దూకుడు చూసిన తర్వాత టీమిండియా పవరేంటో తెలిసింది.
తొలి టెస్టులో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా సారథిగా బుమ్రా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సహా మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టిన తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా బుమ్రా ఎంపికయ్యాడు. దీంతో ప్రారంభ టెస్టులో టీమిండియా 295 పరుగుల విజయాన్ని నమోదు చేసింది.