Share News

JoeRoot: అరుదైన రికార్డు కొట్టి.. అంతలోనే దురదృష్టం వెంటాడింది

ABN , Publish Date - Nov 29 , 2024 | 01:13 PM

ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన విక్టరీని అందుకున్నాడు. కానీ, ఇంతలోనే ఓ చెత్త రికార్డు అతడిని పలకరించింది. దీంతో సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితి ఎదురైంది.

JoeRoot: అరుదైన రికార్డు కొట్టి.. అంతలోనే దురదృష్టం వెంటాడింది
Joe Root

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ తో టెస్టులో భాగంగా ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ అరుదైన మైల్ స్టోన్ ను అందుకున్నాడు. అయితే అంతలోనే ఈ క్రికెటర్ ను మరో చెత్ రికార్డు వెంబడించింది. ప్రపంచంలోనే 150 టెస్టు మ్యాచులు ఆడిన 11 మంది క్రికెటర్లలో జో రూట్ ఒకడిగా నిలిచాడు. అతడి కెరీర్‌లో ఇవాళ నమోదు చేసిన ఈ అరుదైన రికార్డును నిజానికి ఈ ఆటగాడు సెలబ్రేట్ చేసుకోవాలసి ఉంది. కానీ ఇంతలోనే ఈ ఇంగ్లండ్ ప్లేయరను మరో చెత్త రికార్డు పలకరించింది. తొలి ఇన్నింగ్స్ లోనే డకౌట్గా మారిన జోరూట్ తన విక్టరీని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాడు. ప్రపంచ రికార్డును సాధించిన ఈ రోజు అతడికో ఇబ్బందికర పరిణామంగా మారింది.


51.01 సగటుతో 12,754 టెస్ట్ పరుగులతో మ్యాచ్‌లోకి ప్రవేశించిన 33 ఏళ్ల జో రూట్.. న్యూజిలాండ్ మీడియం-పేసర్ నాథన్ స్మిత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కవర్ల గుండా బంతిని రూట్ స్టంప్ లపైకి మళ్లించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం విఫలమై.. బంతి అతడి వెనుక తొడను తగులుతూ స్టంప్స్ పైకి వెళ్లింది. దీంతో తన 150వ టెస్టులో డకౌట్ అయిన మూడో బ్యాటర్ గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. 2002లో షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ లెజెండ్‌లు స్టీవ్ వా, 2010లో అడిలైడ్‌లో ఇంగ్లండ్‌పై సున్నాకి ఔట్ అయిన రికీ పాంటింగ్‌ల క్లబ్బులో జో రూట్ చేరాడు.


ఈ మ్యాచ్ నిరాశను మిగిల్చినప్పటికీ.. గత కొంతకాలంగా ఈ ఆటగాడు అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఐదు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలతో సహా 55.75 సగటుతో ఈ ఏడాదిలోనే 1,338 పరుగులు చేశాడు. అతని కెరీర్‌లో 35 టెస్ట్ సెంచరీలతో, రూట్ ఇంగ్లండ్‌కు కీలక వ్యక్తిగా కొనసాగుతున్నాడు. అయితే శుక్రవారం యాడ్ అయిన డకౌట్ అతని 12 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో 13వది. రూట్ 150 టెస్టులకు చేరుకోవడం అతని కెరీర్లో నిలకడను స్పష్టం చేస్తోంది. మైల్‌స్టోన్ ఇన్నింగ్స్ అనుకున్నంతగా సాగకపోయినప్పటికీ, ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ వారసత్వానికి విశేషమైన సేవలను అందించి జోరూట్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

NZ vs ENG: షాకింగ్.. ఒంటిచేత్తో గాల్లోకి లేచిన క్రికెటర్.. ఇలాంటి క్యాచ్ ఎప్పుడూ చూసుండరు


Updated Date - Nov 29 , 2024 | 01:16 PM