Kuldeep Yadav: బాలీవుడ్ నటి కాదంటూ.. బాంబ్ పేల్చిన కుల్దీప్ యాదవ్
ABN , Publish Date - Jul 07 , 2024 | 08:56 PM
భారత క్రికెట్ జట్టులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన కుల్దీప్ యాదవ్ ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంపై నోరు విప్పాడు. త్వరలోనే తన నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పెళ్లి చేసుకొని..
భారత క్రికెట్ జట్టులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంపై నోరు విప్పాడు. త్వరలోనే తన నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను పెళ్లి చేసుకొని, ఓ ఇంటివాడినవ్వాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నాడు. కానీ.. తాను సినిమా రంగానికి చెందిన వాళ్లను పెళ్లి చేసుకోవడం లేదని కుండబద్దలు కొట్టాడు. తనని, తన కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవడం ముఖ్యమని, అలాంటి గుణాలున్న అమ్మాయినే వివాహమాడుతానని స్పష్టం చేశాడు.
సాధారణంగా.. క్రికెట్‌కి, సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. ఎందరో నటీమణులు క్రికెటర్లతో ప్రేమాయణం సాగించారు. కొన్ని ప్రేమకథలు విజయవంతమై, పెళ్లిదాకా కూడా వచ్చాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా.. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జోడీనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే.. కుల్దీప్ సైతం ఏదైనా నటితో వివాహమాడొచ్చని అంతా అనుకున్నారు. కానీ.. బాలీవుడ్‌కి చెందిన నటీమణిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేశాడు. కుల్దీప్ మాటల్ని బట్టి చూస్తుంటే.. ఇప్పటికే అమ్మాయిని చూసేసి, పెళ్లికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.
కాగా.. టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup 2024) గెలిచిన తర్వాత తన స్వస్థలం కాన్పూర్‌కి వెళ్లినప్పుడు, కుల్దీప్కు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది. డప్పులు కొడుతూ, పాటలు పాడుతూ, స్టెప్పులు వేస్తూ.. అతనిని ఘనంగా ఆహ్వానించారు. దీంతో.. కుల్దీప్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదిలావుండగా.. ఈ మెగా టోర్నీలో కుల్దీప్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 13.90 సగటున 6.95 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు.
Read Latest Sports News and Telugu News