Share News

IND vs NZ: టీమిండియా ఫ్లాప్ షో.. రోహిత్ చెప్పిన కారణం ఇదే

ABN , Publish Date - Oct 26 , 2024 | 05:58 PM

పూణె టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన కారణంగా భారత్ 113 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమిపై రోహిత్ శర్మ అసంతృప్తిగా వ్యక్తం చేశాడు.

IND vs NZ: టీమిండియా ఫ్లాప్ షో.. రోహిత్ చెప్పిన కారణం ఇదే
Rohit Sharma

పూణె: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​ఫైనల్‌కు చేరుకోవాలనే భారత్ ఆశలపై కివీస్ జట్టు నీళ్లు చల్లింది. అక్టోబరు 26న పూణె వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 113 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. సొంతగడ్డపై వరుసగా 18 టెస్టు సిరీస్‌లను గెలుచుకున్న భారత్‌ రికార్డును న్యూజిలాండ్ చెరిపేసింది. ఈ ఓటమి తర్వాత వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలన్న భారత్ కలకి ఎదురుదెబ్బ తగిలింది.


ఇలాంటి ఫలితం ఊహించలేదు

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ ఓటమిని తాము అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కివీస్ జట్టు విసిరిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యామని అన్నాడు. 'ఈ రిజల్ట్ మేం ఊహించినది కాదు. న్యూజిలాండ్ ఈ క్రెడిట్ తీసుకోవడానికి పూర్తి స్థాయి అర్హమైన జట్టు. వాళ్లు మనకంటే బాగా ఆడారు. కొన్ని ప్రత్యేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మేం విఫలమయ్యాం. కివీస్ జట్టు విసిరిన సవాళ్లను స్వీకరించడంలో మేము విఫలమయ్యాము‘ అని రోహిత్ తెలిపాడు.


బ్యాటింగ్ వైఫల్యమే..

టీమ్ఇండియా పేలవ ప్రదర్శన గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. వారిని 250కి చేరువలో స్కోరుకు పరిమితం చేయడం అతి పెద్ద సవాలు అయినప్పటికీ దాన్ని చేయగలిగామని అన్నాడు. కివీస్ ను 259 పరుగులకు అవుట్ చేయడం గొప్ప ప్రయత్నం. ఇది అంత అనువైన పిచ్ కాదు. మేము సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయామనేది వాస్తవం అని రోహిత్ అన్నాడు.

IND vs NZ: 45 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన యశస్వి

Updated Date - Oct 26 , 2024 | 05:59 PM