Ravindra Jadeja: రోహిత్, కోహ్లీ బాటలోనే రవీంద్ర జడేజా.. టీ20లకు గుడ్‌బై
ABN , Publish Date - Jun 30 , 2024 | 05:24 PM
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల బాటలోనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పయనించాడు. అంతర్జాతీయ టీ20 కెరియర్‌కు ముగింపు పలకాడు.
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల బాటలోనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పయనించాడు. అంతర్జాతీయ టీ20 కెరియర్‌కు ముగింపు పలికాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించాడు. అయితే ఇతర ఫార్మాట్లలో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
‘‘కృతజ్ఞతా భావంతో నిండిన హృదయంతో నేను టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. గర్వంతో కూడిన రేసు గుర్రంలా దేశానికి ఎల్లప్పుడూ నా అత్యుత్తమైన ప్రదర్శన ఇచ్చాను. ఇతర ఫార్మాట్‌లలో యథావిథిగా కొనసాగుతాను. టీ20 ప్రపంచకప్‌ను గెలవడంతో ఒక కల నిజమైంది. నా టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇది అత్యుత్తమ దశ. ఎన్నో జ్ఞాపకాలు, ఆనందభరిత క్షణాలు, అసాధారణ మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రవీంద్ర జడేజా ఆదివారం ప్రకటించాడు.
కాగా సౌరాష్ట్రకు చెందిన 35 ఏళ్ల ఈ స్పిన్ ఆల్ రౌండర్ ఫిబ్రవరి 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మొత్తం 74 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 515 పరుగులు, 54 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచ కప్ 2024లో రవీంద్ర జడేజా అన్ని మ్యాచ్‌లు ఆడారు. 8 మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ తీసి, 35 పరుగులు సాధించాడు.