Share News

అన్‌క్యా్‌పడ్‌ ప్లేయర్‌గా ధోనీ?

ABN , Publish Date - Aug 18 , 2024 | 02:03 AM

మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనేది భారత క్రికెట్‌ అభిమానుల మదిని తొలిచే సందేహం. దీన్ని నివృత్తి చేసేలా బీసీసీఐ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ వేలంలో పాత అన్‌క్యా్‌పడ్‌ నిబంధనను...

అన్‌క్యా్‌పడ్‌ ప్లేయర్‌గా ధోనీ?

ఐపీఎల్‌లో అమల్లోకి రానున్న పాత రూల్‌!

న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతాడా? లేదా? అనేది భారత క్రికెట్‌ అభిమానుల మదిని తొలిచే సందేహం. దీన్ని నివృత్తి చేసేలా బీసీసీఐ చర్యలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ వేలంలో పాత అన్‌క్యా్‌పడ్‌ నిబంధనను తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే.. ఎంఎస్‌ అన్‌క్యా్‌పడ్‌ ప్లేయర్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ అనుభవం లేని దేశవాళీ ప్లేయర్‌ను అన్‌క్యా్‌పడ్‌ అని పిలుస్తారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచిన క్రికెటర్‌ కూడా అన్‌క్యా్‌పడ్‌ కేటగిరీ కిందికే వస్తాడు. అందుకే ఈ రూల్‌ అమల్లోకి వస్తే ఎక్కువ లాభపడేది సీఎ్‌సకేనే. ధోనీ ప్రస్తుత ధర రూ.12 కోట్లు కాగా, రిటైన్‌ చేసుకుంటే రూ.4 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది.


మిగిలిన సొమ్మును వేలంలో ఇతర ఆటగాళ్ల కోసం వినియోగించుకోవచ్చు. 2008 నుంచి 2021 వరకు ఈ అన్‌క్యా్‌పడ్‌ రిటెన్షన్‌ పాలసీ అమల్లో ఉన్నా ఆ తర్వాత బోర్డు తొలగించింది. మరోవైపు ఈ రూల్‌ను అమలు చేయాలంటూ బీసీసీఐకి తాము విజ్ఞప్తి చేయలేదని సీఎ్‌సకే సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పష్టం చేశాడు. ఆ రూల్‌ ఉండొచ్చని బీసీసీఐ స్వయంగా తమతో చెప్పిందని, కానీ ప్రకటన చేయలేదని అన్నాడు. అంతేకాకుండా ఈసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనను ఎత్తివేయచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - Aug 18 , 2024 | 02:03 AM