నాడు ధోనీ.. నేడు అశ్విన్
ABN , Publish Date - Dec 19 , 2024 | 05:40 AM
ఆసీస్ ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీని అశ్విన్‌కు అందజేస్తున్న కమిన్స్ . అశ్విన్ తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం.. గతంలో ధోనీ ఉదంతాన్ని గుర్తుచేస్తోంది
ఆసీస్ ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీని అశ్విన్‌కు అందజేస్తున్న కమిన్స్
అశ్విన్ తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం.. గతంలో ధోనీ ఉదంతాన్ని గుర్తుచేస్తోంది. 2014లో ధోనీ కూడా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ ఏడాది డిసెంబరులో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ధోనీ.. నాలుగు మ్యాచ్‌ల ఆ సిరీ్‌సలో అప్పటికే రెండు టెస్టులు ముగిసిన అనంతరం అనూహ్యంగా తన వీడ్కోలు ప్రకటన చేశాడు. ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా కేవలం ఓ ప్రకటన రూపంలో ధోనీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని తెలియజేశాడు. ఇప్పుడు అశ్విన్ కూడా మరో రెండు టెస్టులు మిగిలుండగానే సిరీస్ మధ్యలో ఆటకు గుడ్‌బై చెప్పేశాడు.