Share News

Rohit-Kohli: 2028 ఒలింపిక్స్‌లో రోహిత్, విరాట్ ఆడతారని చెప్పిన ద్రవిడ్.. కోహ్లీ రియాక్షన్ చూస్తే..

ABN , Publish Date - Jul 07 , 2024 | 03:58 PM

దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ప్రపంచకప్ సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దేశ ప్రధాని మోదీ కూడా క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Rohit-Kohli: 2028 ఒలింపిక్స్‌లో రోహిత్, విరాట్ ఆడతారని చెప్పిన ద్రవిడ్.. కోహ్లీ రియాక్షన్ చూస్తే..
PM Modi with Indian cricketers

దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ప్రపంచకప్ సాధించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌ను (T20 Worldcup) చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దేశ ప్రధాని మోదీ (PM Modi) కూడా క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురితో ఆసక్తికరంగా మాట్లాడారు. కాగా, టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) 2008 ఒలింపిక్స్ ( 2028 Olympics) గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుతన్నాయి.


``ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు క్రికెట్‌కు చోటు లేదు. కానీ, ప్రస్తుతం ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా భాగమైంది. ఈ విషయం మాకు చాలా సంతోషం కలిగిస్తోంది. అందుకు ఎంతో గర్వపడుతున్నాం. 2028లో లాస్ ఏంజెలెస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో భారత జట్టు తరఫున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా పాల్గొంటారు. ఆ టోర్నీలో వారు అద్భుతంగా ఆడతారని ఆశిస్తున్నా`` అంటూ ప్రధాని మోదీ ముందు ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ద్రవిడ్ మాటలకు కోహ్లీ (Virat Kohli) తల కిందకు వంచుకుని కాసేపు నవ్వుకున్నాడు.


ఈ సందర్భానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపై, వీరిద్దరూ టెస్ట్‌లు, వన్డేలు మాత్రమే ఆడతారు.

ఇవి కూడా చదవండి..

Rishabh Pant: ఆ ఫోన్ కాల్ ఎంతో భరోసా నింపింది.. ప్రధాని మోదీ ముందు రిషభ్ పంత్ ఎమోషనల్!


Virat Kohli: ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు.. రెండో ఆసియన్.. రికార్డు సృష్టించిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 07 , 2024 | 03:59 PM