Shooting Stars : ముకేష్‌కు స్వర్ణం.. సందేశ్‌కు రజతం
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:17 AM
జాతీయ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో తెలుగు షూటర్లు నేలవల్లి ముకేష్, సందేశ్ రెడ్డి పతకాలు కొల్లగొట్టారు. శుక్రవారం న్యూఢిల్లీలో
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ షూటింగ్ చాంపియన్‌షి్‌పలో తెలుగు షూటర్లు నేలవల్లి ముకేష్, సందేశ్ రెడ్డి పతకాలు కొల్లగొట్టారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన 25 మీటర్ల పిస్టల్ జూనియర్ విభాగంలో గుంటూరు షూటర్ ముకేష్ 588 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణంతో మెరిశాడు. ఇదే వేదికగా జరిగిన పారా షూటింగ్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాద్ షూటర్ సందేశ్ రెడ్డి 336 పాయింట్లు స్కోరు చేసి రజతం దక్కించుకున్నాడు.