ప్రతి క్రీడాకారుడూ చాంపియనే
ABN , Publish Date - Aug 16 , 2024 | 01:26 AM
పారి్‌సలో పాల్గొన్న ప్రతి అథ్లెటూ చాంపియనే. మా ప్రభుత్వం క్రీడా రంగానికి మద్దతు కొనసాగిస్తుంది. అత్యున్నత క్రీడా సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడుతుంది’ అని ప్రధాని మోదీ తెలిపారు. పారి్‌సలో ఒలింపిక్స్‌లో...
పారిస్ అథ్లెట్లతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ‘పారి్‌సలో పాల్గొన్న ప్రతి అథ్లెటూ చాంపియనే. మా ప్రభుత్వం క్రీడా రంగానికి మద్దతు కొనసాగిస్తుంది. అత్యున్నత క్రీడా సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడుతుంది’ అని ప్రధాని మోదీ తెలిపారు. పారి్‌సలో ఒలింపిక్స్‌లో తలపడిన భారత బృందం ప్రధానిని ఆయన నివాసంలో గురువారం కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని వారిని అభినందించడంతోపాటు అథ్లెట్లతో ముచ్చటించారు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను కలుసుకోవడం అద్భుతంగా ఉంది. ఆ మెగా ఈవెంట్ సందర్భంగా అథ్లెట్లకు ఎదురైన అనుభవాల గురించి తెలుసుకున్నా’ అని ప్రధాని ఎక్స్‌లో పేర్కొన్నారు.
2036 ఒలింపిక్స్ నిర్వహణకు సిద్ధమవుతున్నాం..
ప్రపంచ అతి పెద్ద క్రీడా పోటీలను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఈక్రమంలో 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఉన్న ఏ అవకాశాన్నీ వదలబోమని ఎర్రకోటనుంచి చేసిన స్వాతంత్య్రదిన ప్రసంగంలో స్పష్టంజేశారు. ‘2036 విశ్వక్రీడలను నిర్వహించాలన్నది భారత్ స్వప్నం. అందుకోసం మేం ఇప్పటికే చర్యలు ప్రారంభించాం’ అని ఆయన గుర్తుచేశారు. భారత్‌తోపాటు సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఇక భారత్ నుంచి అహ్మదాబాద్ ఆతిథ్య నగరంగా రేస్‌లో నిలిచింది.
ఈ పిస్టల్‌తోనే పతకాలు..
పారి్‌సలో 10 మీ. ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, సరబ్ జోత్‌తో కలిసి మిక్స్‌డ్‌లో మొత్తం రెండు కాంస్య పతకాలు సాధించిన షూటర్ మనూ భాకర్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ పోటీలలో తాను ఉపయోగించిన పిస్టల్‌ను మోదీకి చూపడంతోపాటు దానిని ఎలా ఉపయోగిస్తానో ఆమె వివరించింది. సరబ్ జోత్‌తోపాటు కాంస్య పతకం నెగ్గిన రైఫిల్ షూటర్ స్వప్నిల్ కుశాలేతో కూడా ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. పురుషుల 57 కిలోల విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న రెజ్లర్ అమన్ సెహ్రావత్ మోదీతో ఫొటో దిగడంతోపాటు తాను సంతకం చేసిన భారత జెర్సీని ప్రధానికి అందజేశాడు. అలాగే కాంస్య పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు ప్రధానికి ప్రత్యేక కానుక అందజేసింది. జట్టు సభ్యులు సంతకాలు చేసిన జెర్సీ, హాకీ స్టిక్‌ను మోదీకి బహూకరించింది. విశ్వ క్రీడల తర్వాత హాకీకి వీడ్కోలు పలికిన గోల్‌కీపర్ శ్రీజేష్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాలను ధరించి ప్రధానితో ఫొటో దిగారు. క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవ్య, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు భారత అథ్లెట్లు హాజరయ్యారు.