Sourav Ganguly: అప్పుడు అందరూ నన్ను తిట్టారు.. ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు: విమర్శకులపై గంగూలీ ఆగ్రహం
ABN , Publish Date - Jul 14 , 2024 | 11:00 AM
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను సాధించడంతో క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగిపోయారు. రోహిత్ నాయకత్వ పటిమను కొనియాడుతూ మాజీలు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపించారు.
రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్ (T20 Worldcup)ను సాధించడంతో క్రికెట్ ప్రేమికులు సంబరాల్లో మునిగిపోయారు. రోహిత్ నాయకత్వ పటిమను కొనియాడుతూ మాజీలు, క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా నియమించిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) తాజాగా విమర్శకులపై విరుచుకుపడ్డాడు. విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని అప్పట్లో బీసీసీఐ కెప్టెన్‌గా ఉన్న గంగూలీ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంపై అప్పట్లో విమర్శలు చెలరేగాయి.
``రోహిత్ శర్మను నేను కెప్టెన్‌గా నియమించినపుడు అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు ప్రపంచకప్ సాధించడంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అప్పటి విషయం అందరూ మర్చిపోయారు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించింది నేనే`` అని గంగూలీ వ్యాఖ్యానించాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ నుంచే టీమిండియా నిష్క్రమించడంతో కెప్టెన్‌గా కోహ్లీ వైదొలిగాడు. అనంతరం రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ నియమితుడయ్యాడు.
రోహిత్ సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా మెరుగైన ఫలితాలు సాధించింది. 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ వరకు వెళ్లింది. అయితే ఆ రెండు టోర్నీల్లోనూ చివరి మెట్టుపై బోల్తాపడింది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గింది. దీంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
India vs Zimbabwe : ఇద్దరే బాదేశారు
Euro final : నాలుగా.. ఒక్కటా..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..