వచ్చే జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్
ABN , Publish Date - Aug 23 , 2024 | 06:07 AM
వచ్చే ఏడాది భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం విడుదల చేసింది. దీనికోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా 2025, జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య చివరిసారి 2021లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.
మహిళల జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్
షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గురువారం విడుదల చేసింది. దీనికోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా 2025, జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య చివరిసారి 2021లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. తాజా సిరీ్‌సలో తొలి టెస్టుకు లీడ్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత జూలై 2-6న రెండో టెస్టు బర్మింగ్‌హామ్, జూలై 10-14న మూడో టెస్టు లార్డ్స్‌లో, నాలుగో టెస్టు జూలై 23-27న మాంచెస్టర్‌లో, ఆఖరి టెస్టు జూలై 31-ఆగస్టు 4న ది ఓవల్‌లో జరుగుతాయి.
హర్మన్‌ప్రీత్ సేనతో..: భారత పురుషుల జట్టు టెస్టు సిరీస్ ఆడతున్న సమయానే హర్మన్‌ప్రీత్ సేనతో ఇంగ్లండ్ మహిళల జట్టు 8 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా జూన్ 28 నుంచి జూలై 12 వరకు ఐదు టీ20ల సిరీస్.. జూలై 16 నుంచి జూలై 22 వరకు మూడు వన్డేల సిరీస్ జరుగునున్నాయి. ఇదిలావుండగా.. 2026లో ప్రఖ్యాత లార్డ్స్ మైదానం తొలిసారిగా మహిళల టెస్టు క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఏకైక టెస్టు సిరీస్ ఇక్కడ జరుగనుంది.