నితీశ్, ఈశ్వరన్‌పై దృష్టి
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:17 AM
భారత్ ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో గురువారం నుంచి జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో.. తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్...
భారత్, ఆసీస్ ‘ఎ’ జట్ల మ్యాచ్ నేటినుంచి
మాకే (ఆస్ట్రేలియా): భారత్ ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో గురువారం నుంచి జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో.. తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్, పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై ప్రధానం దృష్టి నిలిచింది. ఈ ముగ్గురు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీ్‌సకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పిచ్‌లు, ఇక్కడి పరిస్థితుల్లో నితీశ్, ఈశ్వరన్, ప్రసిద్ధ్ ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరం కానుంది. కంగారూలతో టెస్టులకు ఒకవేళ రోహిత్ దూరమైతే.. ఈశ్వరన్‌ను ఓపెనర్‌గా పంపాలని జట్టు మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఇక, పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
ప్రసిద్ధ్ ఈ మ్యాచ్‌లో రాణిస్తే..టెస్ట్ సిరీ్‌సకు బుమ్రా, సిరాజ్‌తోపాటు మూడో పేసర్‌గా అతడిని ఆడించవచ్చు. ఆంధ్రకు చెందిన రికీ భుయ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్ రుతురాజ్, టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు సాయి సుదర్శన్, పడిక్కళ్, పేసర్ యశ్ దయాల్, నవ్‌దీప్ సైనీ కూడా సత్తా చాటాలనుకుంటున్నారు.