Share News

పదేళ్ల తర్వాత తొలిసారి..

ABN , Publish Date - Jun 28 , 2024 | 04:52 AM

మూడు వన్డేల సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళలు శుక్రవారం ఇక్కడ ప్రారంభమయ్యే ఏకైక టెస్ట్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొనేందుకు సై అంటున్నారు. దశాబ్దం తర్వాత భారత్‌-సౌతాఫ్రికా జట్లు టెస్ట్‌ మ్యాచ్‌లో...

పదేళ్ల తర్వాత తొలిసారి..

ఉదయం 9.30 నుంచి స్పోర్ట్స్‌ 18లో

భారత్‌ X దక్షిణాఫ్రికా ఢీ

నేటినుంచి చెన్నైలో ఏకైక టెస్ట్‌

చెన్నై: మూడు వన్డేల సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళలు శుక్రవారం ఇక్కడ ప్రారంభమయ్యే ఏకైక టెస్ట్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొనేందుకు సై అంటున్నారు. దశాబ్దం తర్వాత భారత్‌-సౌతాఫ్రికా జట్లు టెస్ట్‌ మ్యాచ్‌లో తలపడుతుండడం గమనార్హం. చివరిసారి 2014లో మైసూరులో ఆడిన టెస్ట్‌లో మన మహిళలు 34 పరుగులతో నెగ్గారు. ఇకపోతే.. మన మహిళల క్రికెట్‌ సిరీ్‌సలలో క్రమం తప్పకుండా టెస్ట్‌లు లేని నేపథ్యంలో..సఫారీలతో ఈ మ్యాచ్‌లో ఐదుగురు క్రీడాకారిణులు అరంగేట్రం చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ఉమా ఛెత్రి, ప్రియా పూనియా, సైకా ఇషాఖ్‌, తెలుగు క్రికెటర్లు అరుంధతి రెడ్డి, షబ్నమ్‌ షకీల్‌ వీరిలో ఉన్నారు. మరోవైపు భారత జట్టు చివరిసారి గత డిసెంబరులో టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడింది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన ఒక్కో టెస్ట్‌లో మనోళ్లు విజయం సాధించారు. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీ్‌సలో బ్యాటింగ్‌లో అదరగొట్టిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, వైస్‌-కెప్టెన్‌ మంధాన అదే జోరు కొనసాగిస్తారని భారత్‌ భావిస్తోంది.


ఇంగ్లండ్‌, ఆసీ్‌సతో టెస్ట్‌ మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించిన జెమీమా కూడా సత్తా చాటాలి. ఇక షఫాలీ వర్మ, దీప్తిశర్మ..ప్రస్తుతం టెస్ట్‌ల్లో భారత్‌ తరపున అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్లలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరు కూడా బ్యాట్‌ ఝళిపిస్తే భారత్‌కు తిరుగుండబోదు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లను వణికించిన దీప్తిశర్మ, పూజా వస్త్రాకర్‌ ఆ ప్రదర్శను పునరావృతం చేస్తారని ఆశిస్తోంది. చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించనుండడంతో.. స్నేహ్‌ రాణా ఆఫ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడం సఫారీలకు సవాలే. రెండేళ్లలో కేవలం ఒక టెస్టే ఆడిన సౌతాఫ్రికా జట్టులో కూడా ఐదుగురు క్రికెటర్లు ఈ ఫార్మాట్‌లో అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నారు. కెప్టెన్‌ వోల్వార్ట్‌, ఆల్‌రౌండర్లు సునె లుస్‌, డెల్మీ టకర్‌, బౌలర్లు క్లాస్‌, అనెకా బాష్‌, మ్లాబా కీలకం కానున్నారు. చెపాక్‌ పిచ్‌పై ఎప్పుడో 1976లో ఏకైక మహిళా టెస్ట్‌ మ్యాచ్‌ జరిగింది. భారత్‌-వెస్టిండీ్‌స జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.


జట్లు (అంచనా)

భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, (కెప్టెన్‌), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ/ప్రియా పూనియా, సుభా సతీష్‌, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్‌ (కీపర్‌), దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్‌/రేణుకా ఠాకూర్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌.

దక్షిణాఫ్రికా: లారా వోల్వార్ట్‌ (కెప్టెన్‌), అనేకె బాష్‌, సునే లుస్‌, తజ్మిన్‌ బ్రిట్స్‌, మరిజానే కాప్‌, డెల్మీ టకెర్‌, డి క్లెర్క్‌, సినాలో జఫ్టా, మ్లాబా, మసబాటా క్లాస్‌, టుమి సెఖుకునే/డెర్క్‌సెన్‌.

Updated Date - Jun 28 , 2024 | 04:52 AM