Share News

ధోనీ విషయంలో తప్పు చేశా

ABN , Publish Date - Aug 24 , 2024 | 06:31 AM

మాజీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ గతవారం తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించాడు. అయితే ఇందులో ఆశ్చర్యకరంగా ఎంఎస్‌ ధోనీకి చోటివ్వలేదు. దీంతో నెట్టింట డీకేపై

ధోనీ విషయంలో తప్పు చేశా

దినేశ్‌ కార్తీక్‌'

చెన్నై: మాజీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ గతవారం తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ఎలెవన్‌ జట్టును ప్రకటించాడు. అయితే ఇందులో ఆశ్చర్యకరంగా ఎంఎస్‌ ధోనీకి చోటివ్వలేదు. దీంతో నెట్టింట డీకేపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో అతడు వివరణ ఇచ్చాడు ‘ధోనీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ జాబితా బయటికి వచ్చాకే ఈ పొరపాటును గమనించాను. అందుకే అందరూ నన్ను క్షమించాలి. లిస్టులో ద్రవిడ్‌ ఉండడంతో అతడినే కీపర్‌గా అనుకున్నారు. కానీ నిజానికి నేను కీపర్‌ పేరును మర్చిపోయా. నా జట్టుకు ధోనీనే కెప్టెన్‌’ అని డీకే తెలిపాడు.

Updated Date - Aug 24 , 2024 | 06:31 AM