Share News

గుకేష్‌, ప్రజ్ఞానందకు నిరాశ

ABN , Publish Date - Jul 07 , 2024 | 06:30 AM

టైబ్రేక్‌లో భారత టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్లు గుకేష్‌, ప్రజ్ఞానందను ఓడించిన డిఫెండింగ్‌ చాంప్‌ ఫాబినో కరువానా (అమెరికా) సూపర్‌బెట్‌ క్లాసిక్‌ టైటిల్‌ను నిలబెట్టుకొన్నాడు. అలీ రెజా

గుకేష్‌, ప్రజ్ఞానందకు నిరాశ

కరువానాకు ‘సూపర్‌బెట్‌’ టైటిల్‌

బుచారెస్ట్‌ (రొమేనియా): టైబ్రేక్‌లో భారత టీనేజ్‌ గ్రాండ్‌ మాస్టర్లు గుకేష్‌, ప్రజ్ఞానందను ఓడించిన డిఫెండింగ్‌ చాంప్‌ ఫాబినో కరువానా (అమెరికా) సూపర్‌బెట్‌ క్లాసిక్‌ టైటిల్‌ను నిలబెట్టుకొన్నాడు. అలీ రెజా రెండో స్థానంలో, గుకేష్‌ మూడు, ప్రజ్ఞానంద నాలుగో స్థానంలో నిలిచారు. క్లాసిక్‌ 9వ, ఆఖరి రౌండ్‌లో కరువాన ఓడగా.. గుకేష్‌, ప్రజ్ఞానంద, అలీ రెజా (ఫ్రాన్స్‌) తమ గేమ్‌లను డ్రాగా ముగించారు. దీంతో ఈ నలుగురు తలో 4.5 పాయింట్లతో సంయుక్తంగా టాప్‌లో నిలిచారు. ఫలితంగా విజేతను నిర్ణయించడానికి నిర్వహించిన టైబ్రేక్‌లో గుకేష్‌, ప్రజ్ఞానంద, అలీ రెజాపై మూడు గేమ్‌లూ నెగ్గిన కరువానా టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు.

Updated Date - Jul 07 , 2024 | 06:30 AM