Share News

హాకీ కుర్రాళ్ల హ్యాట్రిక్‌

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:44 AM

సుల్తాన్‌ జొహర్‌ కప్‌ జూనియర్‌ టోర్నమెంట్‌లో భారత హాకీ కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. మూడుసార్లు చాంపియన్‌ భారత్‌ టోర్నీలో ఓటమన్నదే లేకుండా వరుసగా...

హాకీ కుర్రాళ్ల హ్యాట్రిక్‌

భారత్‌కు వరుసగా మూడో గెలుపు

సుల్తాన్‌ జొహర్‌ కప్‌

జొహర్‌ బహ్రు (మలేసియా): సుల్తాన్‌ జొహర్‌ కప్‌ జూనియర్‌ టోర్నమెంట్‌లో భారత హాకీ కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. మూడుసార్లు చాంపియన్‌ భారత్‌ టోర్నీలో ఓటమన్నదే లేకుండా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో భారత్‌ 4-2 గోల్స్‌ తేడాతో ఆతిథ్య మలేసియాను చిత్తు చేసింది. టోర్నీలో ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లాడి మూడు విజయాలతో ఉన్న భారత్‌ ఓవరాల్‌గా 9 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌ 5 పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా (4) మూడో స్థానంలో ఉన్నాయి. భారత్‌ తన తదుపరి మ్యాచ్‌ను బుధవారం ఆస్ట్రేలియాతో ఆడనుంది.

Updated Date - Oct 23 , 2024 | 12:44 AM