Share News

‘కామన్వెల్త్‌’ నుంచి హాకీ అవుట్‌ ?

ABN , Publish Date - Oct 22 , 2024 | 02:00 AM

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్‌ క్రీడల్లో హాకీకి చోటుదక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఖర్చుల నియంత్రణ భాగంగా నిర్వాహకులు ఈ నిర్ణయం....

‘కామన్వెల్త్‌’ నుంచి హాకీ అవుట్‌ ?

మెల్‌బోర్న్‌: స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్‌ క్రీడల్లో హాకీకి చోటుదక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఖర్చుల నియంత్రణ భాగంగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు పత్రికలు కథనాలు వెలువరించాయి. అయితే, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌), కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌) ఈ విషయంపై పెదవి విప్పడం లేదు. రోస్టర్‌ విడుదల చేసిన తర్వాత మాట్లాడతామని ఎఫ్‌ఐహెచ్‌ చెప్పింది. 1998 నుంచి కామన్వెల్త్‌ క్రీడల్లో హాకీ కొనసాగుతోంది. అయితే ఈసారి హాకీతోపాటు హ్యాండ్‌బాల్‌, రోడ్‌రేసింగ్‌ ఈవెంట్లను కూడా తొలగించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. మొత్తంగా 2022 బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో 19 క్రీడలకు చోటు కల్పించగా.. గ్లాస్గోలో ఆ సంఖ్యను 10కి కుదించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - Oct 22 , 2024 | 02:00 AM