చైనాకు భారత్ షాక్
ABN , Publish Date - Nov 17 , 2024 | 06:01 AM
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో జోరుమీదున్న భారత మహిళల హాకీ జట్టు మరో సంచలనం సృష్టించింది. ఒలింపిక్ రజత పతక విజేత చైనాను చిత్తుచేసిన మన అమ్మాయిలు.. వరుసగా నాలుగో విజయంతో సెమీ్‌సకు దూసుకెళ్లారు. శనివారం జరిగిన
3-0తో విజయం
సెమీస్ బెర్త్ ఖరారు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో జోరుమీదున్న భారత మహిళల హాకీ జట్టు మరో సంచలనం సృష్టించింది. ఒలింపిక్ రజత పతక విజేత చైనాను చిత్తుచేసిన మన అమ్మాయిలు.. వరుసగా నాలుగో విజయంతో సెమీ్‌సకు దూసుకెళ్లారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో చైనాను ఓడించింది. నాలుగు మ్యాచ్‌ల నుంచి 8 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. సంగీత కుమారి (32వ నిమిషం), కెప్టెన్ సలీమా టెటే (37వ), దీపిక (60వ) గోల్స్ సాధించారు. లీగ్ దశలో ఆదివారం జరిగే ఐదో, ఆఖరి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడనుంది. ఆట ఆరంభం నుంచే ఎటాకింగ్ గేమ్‌తో భారత్ విరుచుకుపడడంతో.. చైనా డిఫెన్స్‌కే పరిమితమైంది. తొలి నిమిషంలో భారత్‌కు వరుసగా పెనాల్టీ కార్నర్‌లు లభించినా గోల్స్ మాత్రం చేయలేక పోయింది. తొలి క్వార్టర్‌లో చైనా కూడా పెనాల్టీ కార్నర్ సాధించినా.. భారత్ సమర్థంగా అడ్డుకొంది. ఇక, రెండో క్వార్టర్ లో మనీషా ఫ్లిక్‌ను చైనా కీపర్ అడ్డుకోవడంతో గోల్ చేసే అవకాశం చేజారింది. దీంతో ఫస్టాఫ్ గోల్ లెస్‌గా ముగిసింది. అయితే, మూడో క్వార్టర్‌లో సమన్వయంగా ముందుకు సాగిన భారత్.. తగిన ఫలితాన్ని సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో జపాన్ 2-1తో మలేసియాను, కొరియా 4-0తో థాయ్‌లాండ్‌ను ఓడించాయి.