Share News

హైదరాబాద్‌ X ఆంధ్ర

ABN , Publish Date - Nov 13 , 2024 | 03:48 AM

హైదరాబాద్‌-ఆంధ్ర జట్ల రంజీ మ్యాచ్‌ ఇక్కడి ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం నుంచి జరుగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లో ఒక్క మ్యాచ్‌లోనూ రెండు తెలుగు జట్లు...

హైదరాబాద్‌ X ఆంధ్ర

నేటి నుంచి ఉప్పల్‌లో రంజీ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌-ఆంధ్ర జట్ల రంజీ మ్యాచ్‌ ఇక్కడి ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం నుంచి జరుగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లో ఒక్క మ్యాచ్‌లోనూ రెండు తెలుగు జట్లు స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదు. రంజీ ప్లేట్‌ నుంచి ఈ ఏడాది ఎలీట్‌ గ్రూప్‌లోకి వచ్చిన హైదరాబాద్‌ ఆడిన నాలుగింట్లో రెండింట్లో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. పసికూన పుదుచ్చేరిపై గెలిచి పరువు దక్కించుకుంది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ అందుబాటులో లేకపోవడం, ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌, అభిరథ్‌ రెడ్డి నిలకడ లేమి, ఆరంభ స్పెల్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే నాణ్యమైన పేసర్‌ లేని లోటు జట్టులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే, మిడిలార్డర్‌లో కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌, గత మ్యాచ్‌ సెంచరీ హీరో హిమతేజ, ఆల్‌రౌండర్‌ సీవీ మిలింద్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ సొంతగడ్డపై చెలరేగితే ఆంధ్రను నిలవరించవచ్చు.


మరో వైపు ఆంధ్ర జట్టు హనుమ విహారి, కేఎస్‌ భరత్‌, కర్ణ్‌ షిండే వంటి హేమాహేమీ సీనియర్లతో ఉన్నా విజయాలు మాత్రం వరించడం లేదు. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో ఓడిపోయి, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. రికీ భుయ్‌ అందుబాటులో లేకపోవడంతో అనూహ్య పరిస్థితుల్లో జట్టు పగ్గాలు అందుకున్న షేక్‌ రషీద్‌కు సీనియర్లను సమన్వయం చేసుకోవడం కత్తిమీద సాముగా మారింది.

Updated Date - Nov 13 , 2024 | 03:48 AM