Share News

వినేశ్‌.. పంట పండింది!

ABN , Publish Date - Aug 22 , 2024 | 06:36 AM

ఒలింపిక్‌ పతకం సాధించాలన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరి ఉండొచ్చు. కానీ, ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో ఫొగట్‌ను తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అలాగే పారి్‌సలో పతకాలు సాధించిన మరికొందరు అథ్లెట్ల బ్రాండ్‌

వినేశ్‌.. పంట పండింది!
Wrestler Vinesh Phogat

ఒక్కసారిగా పెరిగిన బ్రాండ్‌ వాల్యూ

క్యూ కడుతున్న కంపెనీలు

నీరజ్‌, భాకర్‌కు కూడా భారీ డిమాండ్‌

న్యూఢిల్లీ: ఒలింపిక్‌ పతకం సాధించాలన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కల చెదిరి ఉండొచ్చు. కానీ, ఆమె పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో ఫొగట్‌ను తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా నియమించుకోవడానికి పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అలాగే పారి్‌సలో పతకాలు సాధించిన మరికొందరు అథ్లెట్ల బ్రాండ్‌ వ్యాల్యూ కూడా భారీగా పెరిగింది. ప్యాకేజింగ్‌ ఫుడ్‌, హెల్త్‌, న్యూట్రిషన్‌, జ్యుయెలరీ, బ్యాంకింగ్‌, ఎడ్యుకేషన్‌ ఇలా పలు రంగాలకు చెందిన కంపెనీలు అథ్లెట్లతో ఒప్పందాలు చేసుకోవడానికి పోటీపడుతున్నాయి. పారిస్‌కు ముందు ఫొగట్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు రూ. 25 లక్షలు ఉంటే.. ఇప్పుడు రూ. 75 లక్షల నుంచి కోటి రూపాయలకు పెరిగిందని ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పాడు. పతకం నెగ్గకపోయినా.. ఆమె చూపిన ధైర్యం, హుందాతనం అందరి హృదయాలను గెలుచుకొందన్నాడు. విశ్వక్రీడల్లో 50 కిలోల విభాగం ఫైనల్‌ ముందు 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందనే కారణంతో వినేశ్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. నైకీ, కంట్రీ డిలైట్‌తో ఫొగట్‌ ఒలింపిక్స్‌కు ముందే అగ్రిమెంట్‌ చేసుకొంది. ఇక, రజతం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించిన షూటర్‌ మను భాకర్‌కు కూడా భారీ డిమాండ్‌ నెలకొంది. చోప్రా బ్రాండ్‌ వాల్యూ 30 నుంచి 40 శాతం దాకా పెరిగి.. సుమారు రూ. 330 కోట్లకు చేరుకొందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌లో క్రికెటర్ల తర్వాత చోప్రాకే ఎక్కువ పాపులారిటీ అనడంలో సందేహం లేదు. నీరజ్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు గతంలో రూ. 3 కోట్లు ఉంటే.. మెగా క్రీడల తర్వాత రూ. 4 నుంచి 4.5 కోట్లకు పెరిగిందట. మరోవైపు యూత్‌లో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకొన్న భాకర్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకొనేందుకు కంపెనీలు పెద్ద మొత్తంలో ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. గతంలో ప్రకటనల కోసం ఏడాదికి రూ. 25 లక్షలు మను తీసుకునేది. అయితే, అదిప్పుడు ఏకంగా ఆరు రెట్లు పెరిగి రూ. 1.5 కోట్లకు చేరిందని టాక్‌.

Updated Date - Aug 22 , 2024 | 06:36 AM