Ind vs Ban: బంగ్లాదేశ్ మరో తప్పిదం.. ఐసీసీ నుంచి జరిమానా తప్పదా..?
ABN , Publish Date - Sep 20 , 2024 | 03:55 PM
టీమిండియాతో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో అద్భుత ఆరంభం అందుకున్న బంగ్లాదేశ్ అదే ఒరవడిని కొనసాగించలేకపోయింది. అద్భుత ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 144 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి జోరు మీదున్న బంగ్లా బౌలర్లను అశ్విన్ (113), జడేజా (86) ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే.
టీమిండియాతో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్‌లో (Chennai Test) అద్భుత ఆరంభం అందుకున్న బంగ్లాదేశ్ అదే ఒరవడిని కొనసాగించలేకపోయింది (Ind vs Ban). అద్భుత ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 144 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి జోరు మీదున్న బంగ్లా బౌలర్లను అశ్విన్ (113), జడేజా (86) ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే ఆలౌటై మరింత కష్టాల్లో పడింది. కాగా, బంగ్లాదేశ్‌కు మరో షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది (Slow Over Rate).
తొలి రోజు బంగ్లాదేశ్ చాలా నెమ్మదిగా బౌలింగ్ చేసింది. టెస్ట్ మ్యాచ్‌లో ఒక రోజు మూడు సెషన్లలో కలిపి 90 ఓవర్లు బౌలింగ్ చేయాలనే నిబంధన ఉంది. అయితే బంగ్లాదేశ్ గురువారం నాడు కేవలం 80 ఓవర్లు మాత్రమే వేయగలిగింది. అదనంగా మరో అరగంట కేటాయించినప్పటికీ బంగ్లా కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. 10 ఓవర్ల కంటే తక్కువ బౌలింగ్ చేసినందుకు బంగ్లాదేశ్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. జరిమానాలో భాగంగా బంగ్లాదేశ్‌కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 3 పాయింట్లు, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది. గత నెలలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో కూడా బంగ్లాదేశ్ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది.
కాగా, చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. రెండో రోజు టీమిండియా బౌలర్ల ధాటి ముంది బంగ్లా బ్యాటర్లు నిలువలేకపోయారు. 149 పరుగులకే పెవిలియన్ చేరారు. బంగ్లా బ్యాటర్లలో షకీబ్ (32)దే అత్యధిక స్కోరు. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్, సిరాజ్, జడేజా రెండేసి వికెట్లు తీశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌పై భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 227 పరుగులుగా ఉంది.
ఇవి కూడా చదవండి..
India vs Bangladesh: టీమిండియా ఆలౌట్.. బంగ్లా బ్యాటింగ్ మొదలుపెట్టగానే..
Ravichandran Ashwin: చారిత్రాత్మక సెంచరీ గురించి సిక్రెట్ చెప్పిన అశ్విన్.. ధోని రికార్డును
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..