Share News

ఆసియా క్వీన్‌ భారత్‌

ABN , Publish Date - Dec 23 , 2024 | 05:17 AM

భారత జట్టు అండర్‌-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న తెలుగు బ్యాటర్‌ గొంగడి త్రిష ఫైనల్లోనూ అదరగొట్టింది. క్లిష్టమైన పిచ్‌పై ఓపెనర్‌గా దిగిన త్రిష (47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) మెరుపు...

ఆసియా క్వీన్‌ భారత్‌

అండర్‌-19 టీ20 చాంపియన్‌షిప్‌

హాఫ్‌ సెంచరీతో మెరిసిన త్రిష

ఫైనల్లో బంగ్లాదేశ్‌ చిత్తు

కౌలాలంపూర్‌: భారత జట్టు అండర్‌-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న తెలుగు బ్యాటర్‌ గొంగడి త్రిష ఫైనల్లోనూ అదరగొట్టింది. క్లిష్టమైన పిచ్‌పై ఓపెనర్‌గా దిగిన త్రిష (47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) మెరుపు హాఫ్‌ సెంచరీతో భళా అనిపించింది. దాంతో బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మహిళల అండర్‌-19 ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌ ఫైనల్లో యువ భారత్‌ 41 పరుగులతో ఘన విజయం సాధించింది. తద్వారా తొలిసారి నిర్వహించిన టోర్నీ టైటిల్‌ అందుకుంది. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 117 పరుగులు సాధించింది. మిథిలా వినోద్‌ (17), కెప్టెన్‌ నికీ ప్రసాద్‌ (12) పర్లేదనిపించారు. ఫర్జానా నాలుగు వికెట్లు పడగొట్టింది.


55-Sp.jpg

స్వల్ప ఛేదనలో భారత స్పిన్నర్లు ఆయుషి (3/17), పరునిక (2/12), సోనమ్‌ (2/13) ధాటికి బంగ్లాదేశ్‌ 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. ఫిర్దౌస్‌ (22), ఫహోమిద (18) మాత్రమే రాణించారు. త్రిష ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’గా నిలవడం విశేషం.

సంక్షిప్తస్కోర్లు

భారత్‌: 20 ఓవర్లలో 117/7 (త్రిష 52, మిథిలా వినోద్‌ 17, నికీ ప్రసాద్‌ 12, ఫర్జానా 4/31, నిషిత 2/23).

బంగ్లాదేశ్‌: 18.3 ఓవర్లలో 76 ఆలౌట్‌ (ఫిర్దౌస్‌ 22, ఫహోమిద 18, ఆయుషి శుక్లా 3/17, పరునిక 2/12, సోనమ్‌ 2/13).

Updated Date - Dec 23 , 2024 | 05:17 AM