India vs West Indies : జోరు కొనసాగాలి!
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:35 AM
ఐదేళ్ల తర్వాత స్వదేశంలో టీ20 సిరీస్ విజయంతో భారత మహిళల జట్టు జోష్‌లో ఉంది. ఈనేపథ్యంలో వెస్టిండీ్‌సతో మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్
విండీస్‌తో భారత్ తొలి వన్డే నేడు
వడోదర: ఐదేళ్ల తర్వాత స్వదేశంలో టీ20 సిరీస్ విజయంతో భారత మహిళల జట్టు జోష్‌లో ఉంది. ఈనేపథ్యంలో వెస్టిండీ్‌సతో మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వడోదరలో కొత్తగా నిర్మించిన కోటంబి స్టేడియంలో ఆదివారం జరిగే ఈ వన్డేనే తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఓవరాల్‌గా ఇరుజట్ల మధ్య 26 మ్యాచ్‌లు జరగ్గా భారత్ 21-05తో ఆధిక్యంలో ఉంది. ఈనెల ఆరంభంలో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత హర్మన్‌ప్రీత్ సేన విండీ్‌సపై టీ20ల్లో చెలరేగి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన భీకర ఫామ్‌లో ఉంది. వరుసగా మూడు అర్ధసెంచరీలతో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. దీనికితోడు తన చివరి 10 వన్డేల్లోనూ తను 599 పరుగులతో రాణించడం సానుకూలాంశం కానుంది. ఇదే జోరు తాజా సిరీ్‌సలోనూ కొనసాగిస్తే భారత్‌కు మరో సిరీస్ ఖాయమే. చివరి రెండు టీ20లకు కెప్టెన్ హర్మన్ గాయంతో దూరం కాగా, మంధాన నాయకత్వంలోనూ ఆకట్టుకోగలిగింది. మరోవైపు హర్మన్ ఫిట్‌నె్‌సపై స్పష్టత రావాల్సి ఉంది. దీప్తి, రేణుక సైమా, టిటాన్ సాధులతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు విండీస్ ఆశలన్నీ కెప్టెన్ హేలీ మాథ్యూస్, వెటరన్ డియాండ్రా, క్యాంప్‌బెల్ ఆటపైనే ఆధారపడి ఉన్నాయి.