Share News

భారత యూత్‌ క్లీన్‌స్వీ్‌ప

ABN , Publish Date - Oct 10 , 2024 | 05:05 AM

స్పిన్నర్లు అన్‌మోల్‌జీత్‌ సింగ్‌, మహ్మద్‌ ఎనాన్‌.. 20 వికెట్లలో 16 పడగొట్టడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో యూత్‌ టెస్ట్‌లో భారత అండర్‌-19 జట్టు ఇన్నింగ్స్‌ 120 పరుగులతో ఘన విజయం సాధించింది...

భారత యూత్‌ క్లీన్‌స్వీ్‌ప

రెండో టెస్ట్‌లోనూ ఆసీ్‌సపై ఘన విజయం

చెన్నయ్‌ : స్పిన్నర్లు అన్‌మోల్‌జీత్‌ సింగ్‌, మహ్మద్‌ ఎనాన్‌.. 20 వికెట్లలో 16 పడగొట్టడంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో యూత్‌ టెస్ట్‌లో భారత అండర్‌-19 జట్టు ఇన్నింగ్స్‌ 120 పరుగులతో ఘన విజయం సాధించింది. అంతేకాదు రెండు టెస్ట్‌ల సిరీ్‌సను 2-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. బుధవారం, మూడో రోజు ఆస్ట్రేలియా 17 వికెట్లు కోల్పోవడం గమనార్హం. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు 492 రన్స్‌కు జవాబుగా..ఓవర్‌నైట్‌ 142/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన పర్యాటక జట్టు 277 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఫాలోఆన్‌ చేపట్టిన ఆస్ట్రేలియా అండర్‌-19 భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులకే కుప్పకూలింది.

Updated Date - Oct 10 , 2024 | 05:05 AM