Share News

భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో..!

ABN , Publish Date - Dec 23 , 2024 | 04:58 AM

హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించే చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆడే మ్యాచ్‌ల తటస్థ వేదిక ఖరారైంది. లీగ్‌ దశలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించనున్నట్టు...

భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో..!

చాంపియన్స్‌ ట్రోఫీ

కరాచీ: హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించే చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆడే మ్యాచ్‌ల తటస్థ వేదిక ఖరారైంది. లీగ్‌ దశలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించనున్నట్టు ఆతిథ్య పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు సంబంధించిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవేళ భారత్‌ సెమీస్‌, ఫైనల్‌ చేరితే యూఏఈనే వేదిక కానుంది. పీసీబీ చైర్మన్‌ మొహసిన్‌ నఖ్వీ, యూఏఈ క్రికెట్‌ అధ్యక్షుడు ముబారక్‌ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. వేదికలపై స్పష్టత వస్తే.. ఐసీసీ వీలైనంత వేగంగా షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

Updated Date - Dec 23 , 2024 | 05:35 AM