Share News

భారత్‌-పాక్‌ పోరు.. టిక్కెట్‌@ రూ. 16.50 లక్షలా?

ABN , Publish Date - May 24 , 2024 | 02:45 AM

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య పోరు..అందునా వరల్డ్‌ కప్‌..అదీ టీ20 ప్రపంచ కప్‌..ఇంకేం ఈ బ్లాక్‌బస్టర్‌ మ్యాచ్‌ టిక్కెట్లకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతాకాదు. సరిగ్గా ఈ డిమాండ్‌నే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భారీగా క్యాష్‌...

భారత్‌-పాక్‌ పోరు.. టిక్కెట్‌@ రూ. 16.50 లక్షలా?

భారత్‌-పాక్‌ పోరు..

టిక్కెట్‌@ రూ. 16.50 లక్షలా?

న్యూఢిల్లీ: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య పోరు..అందునా వరల్డ్‌ కప్‌..అదీ టీ20 ప్రపంచ కప్‌..ఇంకేం ఈ బ్లాక్‌బస్టర్‌ మ్యాచ్‌ టిక్కెట్లకు ఉన్న డిమాండ్‌ అంతా ఇంతాకాదు. సరిగ్గా ఈ డిమాండ్‌నే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) భారీగా క్యాష్‌ చేసుకుంటోందట! జూన్‌ తొమ్మిదిన న్యూయార్క్‌లోని నసౌ స్టేడియంలో జరిగే ఈ మెగా పోరు ఒక్కో టిక్కెట్‌ను ఐసీసీ ఏకంగా రూ. 16.50 లక్షలకుపైగానే అమ్ముతోందని ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ ఆరోపించాడు. స్టేడియంలోని డైమండ్‌ క్లబ్‌ సెక్షన్‌లో సీట్‌ టిక్కెట్‌కు ఈ రేటు నిర్ణయించడాన్ని అతడు ఆక్షేపించాడు. ‘క్రికెట్‌ను మరింత విస్తరించే లక్ష్యంతో అమెరికాలో ప్రపంచ కప్‌ను నిర్వహిస్తున్నారు. కానీ ఐసీసీ మాత్రం కలెక్షన్లకు ఈ టోర్నీని ఉపయోగించుకుంటోంది. ఇతర టిక్కెట్లను కూడా రూ. 2.30 లక్షలకు తక్కువ కాకుండా అమ్మడం లేదు’ అని అన్నాడు.

Updated Date - May 24 , 2024 | 02:45 AM