IPL 2024 Final: ముగిసిన పవర్ ప్లే.. నెమ్మదిగా సాగుతున్న హైదరాబాద్ ఇన్నింగ్స్!
ABN , Publish Date - May 26 , 2024 | 08:07 PM
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ (IPL 2024) మ్యాచ్ జరుగుతోంది
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ (IPL 2024) మ్యాచ్ జరుగుతోంది (SRH VS KKR). టాస్ గెలిచిన హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కోల్‌కతా బ్యాటర్లు చెలరేగారు. హైదరాబాద్ ప్రమాదకర ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
మరో ప్రమాదకర బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి (9) కూడా స్టార్క్ బౌలింగ్‌లో పెద్ద షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. రమణ్ దీప్ పట్టిన హై క్యాచ్‌కు అవుటై పెవిలియన్ చేరాడు. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ బ్యాటర్లు నెమ్మదిగా ఆడుతున్నారు. స్వింగ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హైదరాబాద్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతోంది. వైభవ్ అరోరా వేసిన ఆరో ఓవర్లో మాత్రం వరుస బౌండరీలతో మార్‌క్రమ్ చెలరేగాడు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీమ్ 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్ (15), నితీష్ కుమార్ (7) క్రీజులో ఉన్నారు.