Share News

IPL : మార్చి 22 నుంచి ఐపీఎల్‌

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:50 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఎప్పుడు జరుగుతుంది.. భారత్‌లోనే నిర్వహిస్తారా? తదితర సందిగ్ధమైన అంశాలకు తెరదించాడు

 IPL : మార్చి 22 నుంచి ఐపీఎల్‌

టోర్నీ మొత్తం భారత్‌లోనే..

లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఎప్పుడు జరుగుతుంది.. భారత్‌లోనే నిర్వహిస్తారా? తదితర సందిగ్ధమైన అంశాలకు తెరదించాడు లీగ్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌. ఈ సీజన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ దేశంలోనే జరుగుతాయనీ, వచ్చేనెల.. అంటే మార్చి 22న లీగ్‌ ప్రారంభమవుతుందని ధూమల్‌ స్పష్టతనిచ్చాడు. పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నాడు. ఈ ఏప్రిల్‌, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఐపీఎల్‌ పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఐపీఎల్‌లో తొలి పదిహేను రోజుల షెడ్యూల్‌ను ముందుగా ప్రకటించి, మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను సార్వత్రిక ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత వెల్లడిస్తామని ధూమల్‌ తెలిపాడు. వచ్చేనెలలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముంది. 2009లో తొలిసారిగా ఐపీఎల్‌ను పూర్తిగా విదేశం (దక్షిణాఫ్రికా)లో నిర్వహించిన నిర్వాహకులు.. సార్వత్రిక ఎన్నికల కారణంగా 2014 అంచెలో కొంత భాగం యూఏఈలో జరిపారు. ఇక, 2019లో ఎన్నికలున్నప్పటికీ మొత్తం టోర్నమెంట్‌ భారత్‌లోనే జరిగింది. అయితే, టీ20 ప్రపంచకప్‌ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఐపీఎల్‌ ఫైనల్‌ను మే 26న జరిపే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం.

Updated Date - Feb 21 , 2024 | 03:50 AM