Match Against Mumbai : ములానీ, తనుష్ తిప్పేశారు
ABN , Publish Date - Oct 05 , 2024 | 02:12 AM
స్పిన్నర్లు షామ్స్ ములానీ, తనుష్ కోటియన్ తిప్పేయడంతో ముంబైతో ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది.
రెస్ట్ తొలి ఇన్నింగ్స్ 416 ఆలౌట్
లఖ్‌నవూ: స్పిన్నర్లు షామ్స్ ములానీ, తనుష్ కోటియన్ తిప్పేయడంతో ముంబైతో ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ముంబై శుక్రవారం ఆఖరికి ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ 121 రన్స్‌తో కలిపి ముంబై మొత్తం 274 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో 537 రన్స్ చేసింది. ఓవర్‌నైట్ 289/4తో నాలుగో రోజు మొదటి ఇన్నింగ్స్ కొనసాగించగా..కిందటి రోజు బ్యాటర్లు అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ ఐదో వికెట్‌కు 165 పరుగులు జోడించారు. అయితే ద్విశతకం దిశగా సాగుతున్న అభిమన్యు (191), సెంచరీకి చేరువైన జురెల్ (93)ను స్పిన్నర్ ములానీ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. ఆపై మరో స్పిన్నర్ కోటియన్ విజృంభించడంతో ‘రెస్ట్’ బ్యాటింగ్ కుప్పకూలింది.
సంక్షిప్తస్కోర్లు: ముంబై తొలి ఇన్నింగ్స్: 537, రెండో ఇన్నింగ్స్: 153/6 (పృథ్వీ షా 76, కోటియన్ బ్యాటింగ్ 20, సారాన్ష్ జైన్ 4/67, సుతార్ 2/40).
రెస్టాఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్: 416 (అభిమన్యు ఈశ్వరన్ 191, జురెల్ 93, కోటియన్ 3/101, ములానీ 3/122).