Share News

అగ్రస్థానంలో అర్జున్‌

ABN , Publish Date - Nov 09 , 2024 | 05:52 AM

ప్రపంచ నెంబర్‌ 2 ఇరిగేసి అర్జున్‌ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ నాలుగో రౌండ్‌లో అర్జున్‌ విజయం సాధించాడు. ఇరాన్‌ జీఎం అమీన్‌తో తలపడిన అర్జున్‌ 52వ

అగ్రస్థానంలో అర్జున్‌

చెన్నై: ప్రపంచ నెంబర్‌ 2 ఇరిగేసి అర్జున్‌ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ నాలుగో రౌండ్‌లో అర్జున్‌ విజయం సాధించాడు. ఇరాన్‌ జీఎం అమీన్‌తో తలపడిన అర్జున్‌ 52వ ఎత్తులో ప్రత్యర్థికి చెక్‌ చెప్పాడు. ప్రస్తుతానికి అర్జున్‌ 3.5 పాయింట్లతో టాప్‌లో, అమెరికా జీఎం అరోనియన్‌ 2.5 పాయింట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇక చెన్నై చాలెంజర్స్‌ టోర్నీలో ద్రోణవల్లి హారిక మూడో ఓటమిని చవి చూసింది. భారత జీఎం కార్తీకేయన్‌ మురళీతో తలపడిన హారిక 43వ ఎత్తులో పరాజయం పాలైంది.

హంపికి ఐదో స్థానం

షైంకెంట్‌: ఫిడే మహిళల గ్రాండ్‌ ప్రీలో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి ఐదో స్థానంతో నిరాశపర్చింది. ఆఖరి రౌండ్‌ను డ్రాగా ముగించిన రష్యా జీఎం అలెగ్జాండ్రా

గోర్యెంచ్‌కినా 7 పాయింట్లతో విజేతగా నిలవగా, చైనా జీఎం టాన్‌ ఝాంగీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం ముగిసిన ఆఖరిదైన తొమ్మిదో రౌండ్‌ను హంపి డ్రా చేసుకుంది.

Updated Date - Nov 09 , 2024 | 05:52 AM