Share News

టీఓఏ పీఠంపై జితేందర్‌

ABN , Publish Date - Dec 12 , 2024 | 06:20 AM

అత్యంత ఉత్కంఠ రేపిన తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) కార్యవర్గం ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి పైచేయి సాధించారు. సంఘం అధ్యక్షునిగా జితేందర్‌

టీఓఏ పీఠంపై జితేందర్‌

34 ఓట్లతో విజయంఫ కార్యదర్శిగా మల్లారెడ్డి

హైదరాబాద్‌: అత్యంత ఉత్కంఠ రేపిన తెలంగాణ ఒలింపిక్‌ సంఘం (టీఓఏ) కార్యవర్గం ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి పైచేయి సాధించారు. సంఘం అధ్యక్షునిగా జితేందర్‌ ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయన తన ప్రత్యర్థి చాముండేశ్వరనాథ్‌పై 34 ఓట్ల తేడాతో గెలుపొందారు. జితేందర్‌కు 43 ఓట్లు పోలవగా.. చాముండికి 9 ఓట్లు దక్కాయి. కార్యదర్శి పదవిని మల్లారెడ్డి దక్కించుకున్నారు. 40 ఓట్లు సొంతం చేసుకున్న ఆయన బాబురావు (12)ను ఓడించారు. కోశాధికారి పదవికి సతీష్‌ గౌడ్‌ ఎన్నికయ్యారు. సతీ్‌షకు 40, ప్రత్యర్ది ప్రదీ్‌పకు 12 ఓట్లు దక్కాయి. టీఓఏ నూతన కార్యవర్గం కోసం గతనెల 21వ తేదీనే ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగగా.. మిగతా పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయి. అయితే, కోర్టులో స్టే ఉండడంతో అప్పట్లో ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపివేశారు. కోర్టు స్టే ఎత్తివేయడంతో తాజాగా ఫలితాలను ప్రకటించారు. నూతన కార్యవర్గం నాలుగేళ్లపాటు పదవిలో ఉండనుంది.

జితేందర్‌ ఎన్నిక చెల్లదు: చాముండి

టీఓఏ అఽధ్యక్షునిగా జితేందర్‌ రెడ్డి గెలిచినా, అతని ఎన్నిక చెల్లదని చాముండేశ్వరనాథ్‌ ఆరోపించారు. క్రీడా బిల్లు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులనీ, ఆ రకంగా చూస్తే జితేందర్‌ అధ్యక్ష స్థానానికి అర్హుడు కాదని చాముండి అన్నారు. భారత ఒలింపిక్‌ సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాననీ, త్వరలో తానే టీఓఏ పీఠాన్ని అధిష్టిస్తానని చెప్పారు.

Updated Date - Dec 12 , 2024 | 06:20 AM