టీఓఏ ఎన్నికలకు జితేందర్ రెడ్డి అనర్హుడు
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:19 AM
తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అధ్యక్షుడిగా పోటీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి అనర్హుడని రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు...
ఐఓఏకి చాముండి లేఖ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అధ్యక్షుడిగా పోటీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి అనర్హుడని రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరనాథ్ తెలిపారు. ఈ విషయమై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు చాముండేశ్వరనాథ్ లేఖాస్త్రం సంధించారు. ‘2011 స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 70 ఏళ్లు నిండిన వారు క్రీడా సంఘాల ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఈ నిబంధనను ఉల్లంఘించి జితేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా కేవలం 8 జిల్లాలకే ఓటు హక్కు ఇచ్చారు. టీఓఏ వ్యవహారాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఇటీవల మీరు వి.షియాద్‌ను కమిషనర్‌గా నియమించారు. వచ్చే నెల 10వ తేదీన వారు నివేదిక సమర్పించాల్సి ఉంది. అప్పటివరకు ఎన్నికలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో చాముండేశ్వర్‌నాథ్ పేర్కొన్నారు.