Share News

Jonty Rhodes: గంభీర్ రికమెండ్ చేసినా నో ఛాన్స్.. లెజెండరీ ఫీల్డర్ జాంటీ రోడ్స్ స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Sep 14 , 2024 | 06:43 PM

టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. గౌతమ్ గంభీర్ టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. సహాయక సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఇవ్వాలని కూడా ఆ సమయంలో గంభీర్ కండీషన్ పెట్టాడు. అనుకున్నట్టే తనతో గతంలో పని చేసిన వారిని సహాయక సిబ్బందిగా ఎంచుకున్నాడు.

Jonty Rhodes: గంభీర్ రికమెండ్ చేసినా నో ఛాన్స్.. లెజెండరీ ఫీల్డర్ జాంటీ రోడ్స్ స్పందన ఏంటంటే..
Jonty Rhodes

టీ20 ప్రపంచకప్ (T20 World Cup) విజయం తర్వాత టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. సహాయక సిబ్బందిని ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఇవ్వాలని కూడా ఆ సమయంలో గంభీర్ కండీషన్ పెట్టాడు. అనుకున్నట్టే తనతో గతంలో పని చేసిన వారిని సహాయక సిబ్బందిగా ఎంచుకున్నాడు. అయితే ఫీల్డింగ్ కోచ్ (Fielding Coach) విషయంలో సందిగ్ధత నెలకొంది. జాంటీ రోడ్స్ (Jonty Rhodes ) ఫీల్డింగ్ కోచ్‌గా కావాలని గంభీర్ కోరాడు. అయితే అందుకు బీసీసీఐ (BCCI) నుంచి అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఈ విషయంపై జాంటీ రోడ్స్ విస్మయం వ్యక్తం చేశాడు.


``టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా గంభీర్ నన్ను రికమెండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. గంభీర్ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించిందనే వార్తను నేను నమ్మలేకపోయా. టీమిండియా అంతర్జాతీయ ఫీల్డింగ్ కోచ్ అక్కర్లేదని వారు అనుకుంటున్నారేమో. నిజానికి నేను కూడా లోకల్. నాది గోవా. ఫీల్డింగ్ కోచ్‌గా అవకాశం రాకపోవడం చాలా నిరాశ కలిగించేదే. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. ధోనీ, కోహ్లీ తరం వచ్చాక టీమిండియాలో ఫిట్‌నెస్ అనేది కీలకంగా మారిపోయింది. ప్రస్తుతం సెలక్షన్ ప్రక్రియలో ఫిట్‌నెస్ అనేది ఓ కీలకాంశంగా మారిపోయింది. అందుకే ఫీల్డింగ్‌లో భారత్ మెరుగైంది`` అని రోడ్స్ అన్నాడు.


జాంటీ రోడ్స్ తన తరంలో అత్యుత్తమ ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున మైదానంలో మెరుపు విన్యాసాలతో అదరగొట్టేవాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత ఫీల్డింగ్ కోచ్‌గా అవతారమెత్తాడు. ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. ఆ సమయంలోనే గంభీర్‌తో కలిసి పని చేశాడు. ఆ పరిచయంతోనే టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ను నియమించాలని గంభీర్ కోరాడు. అయితే బీసీసీఐ అందుకు తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

Longest Test match: 11 రోజులు.. 680 ఓవర్లు.. అంపైర్లకు చిరాకు తెప్పించిన ఆ టెస్ట్ మ్యాచ్ వివరాలు తెలిస్తే..


Team India: విదేశీయుడికి టీమ్ ఇండియా కొత్త బౌలింగ్ కోచ్ బాధ్యతలు


Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 14 , 2024 | 06:43 PM