Share News

యూపీ.. వరుసగా 8వ విజయం

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:49 AM

ప్రొ. కబడ్డీ తాజా సీజన్‌లో యూపీ యోధాస్‌ గెలుపు జోరును కొనసాగించింది. వరుసగా ఎనిమిదో విజయం అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో యోధాస్‌ 59-23తో...

యూపీ.. వరుసగా 8వ విజయం

పుణె: ప్రొ. కబడ్డీ తాజా సీజన్‌లో యూపీ యోధాస్‌ గెలుపు జోరును కొనసాగించింది. వరుసగా ఎనిమిదో విజయం అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో యోధాస్‌ 59-23తో గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. గగన్‌ గౌడ 19 పాయింట్లతో చెలరేగగా, భవానీ రాజ్‌పుత్‌ సూపర్‌-10తో సత్తా చాటాడు. సుమిత్‌ హై-5 సాధించాడు. మరో మ్యాచ్‌లో యూ ముంబా 43-37తో పట్పా పైరేట్స్‌ను ఓడించింది.

Updated Date - Dec 20 , 2024 | 05:49 AM