కోహ్లీ X కాన్‌స్టా్‌స
ABN , Publish Date - Dec 27 , 2024 | 02:16 AM
అరంగేట్రం ఆటగాడు కాన్‌స్టా్‌సను కవ్వించే పయత్నం చేసిన కోహ్లీపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకొంది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జోడించింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ ముగిశాక బంతి తీసుకొని కోహ్లీ...
విరాట్‌కు జరిమానా
అరంగేట్రం ఆటగాడు కాన్‌స్టా్‌సను కవ్వించే పయత్నం చేసిన కోహ్లీపై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకొంది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా జోడించింది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ ముగిశాక బంతి తీసుకొని కోహ్లీ మరో ఎండ్‌కు వస్తున్నాడు. మరోవైపు నాన్‌స్ట్రయికర్‌తో మాట్లాడేందుకు కాన్‌స్టా్‌స కూడా ముందుకు వెళ్తున్నాడు. ఈ సమయంలో విరాట్ భుజం కాన్‌స్టా్‌సకు తగిలింది. అయితే, కోహ్లీ చర్యను తప్పుబట్టిన మ్యాచ్ రెఫరీ లెవల్-1 ఉల్లంఘన కింద అతడిపై జరిమానా విధించాడు. ఆసీస్ మాజీ ఆటగాళ్లు కూడా కోహ్లీ తీరును తప్పుబట్టారు. విరాట్ ఉద్దేశపూర్వకంగానే వచ్చి తగిలినట్టుగా వీడియోలో కనిపిస్తోందని పాంటింగ్ అన్నాడు. కింగ్ లాంటి కోహ్లీ.. 19 ఏళ్ల పిల్లాడితో ఇలా వ్యవహరించడం సబబు కాదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వ్యాఖ్యానించాడు.