Share News

కోల్‌కతాదే తొలి అడుగు

ABN , Publish Date - May 12 , 2024 | 02:20 AM

అత్యంత రసవత్తరంగా సాగుతున్న తాజా ఐపీఎల్‌లో ఎట్టకేలకు ప్లేఆ్‌ఫ్సలో చేరిన తొలి జట్టేదో తేలిపోయింది. వరుసగా నాలుగు విజయాలతో జోరు చూపిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇతర టీమ్స్‌కన్నా ముందే...

కోల్‌కతాదే తొలి అడుగు

నేటి మ్యాచ్‌లు

చెన్నై X రాజస్థాన్‌, మ.3.30, గం. నుంచి

బెంగళూరు X ఢిల్లీ, రాత్రి 7.30 గం. నుంచి

కోల్‌కతాకు ప్లేఆ్‌ఫ్సలో చోటు

ముంబై ఇండియన్స్‌పై విజయం

రాణించిన వెంకటేశ్‌ అయ్యర్‌

కోల్‌కతా: అత్యంత రసవత్తరంగా సాగుతున్న తాజా ఐపీఎల్‌లో ఎట్టకేలకు ప్లేఆ్‌ఫ్సలో చేరిన తొలి జట్టేదో తేలిపోయింది. వరుసగా నాలుగు విజయాలతో జోరు చూపిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇతర టీమ్స్‌కన్నా ముందే బెర్త్‌ దక్కించుకుంది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 18 రన్స్‌ తేడాతో నెగ్గింది. దీంతో 18 పాయింట్లతో ఈ జట్టు అధికారికంగా ప్లేఆ్‌ఫ్సకు అర్హత సాధించింది. భారీ వర్షం కారణంగా రాత్రి 9.15 గంటలకు ఆరంభమైన మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 42), నితీశ్‌ రాణా (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) రాణించారు. పీయూష్‌, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 16 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసి ఓడింది. ఇషాన్‌ (22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), తిలక్‌ (17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) మాత్రమే ఆకట్టుకున్నారు. వరుణ్‌, రస్సెల్‌, హర్షిత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.


ఓపెనర్లదే పోరాటం: ముంబై ఇండియన్స్‌ తమ ఛేదనను దీటుగానే ఆరంభించింది. ఓపెనర్లు ఇషాన్‌, రోహిత్‌ (19) తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అయితే మొదటి ఏడు ఓవర్ల వరకే జట్టు పోటీలో ఉంది. ఇషాన్‌ నిష్క్రమణ తర్వాత ఒక్కసారిగా తడబడి మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్ల ధాటికి పవర్‌ప్లేలోనే జట్టు 59 పరుగులు సాధించింది. నాలుగో ఓవర్‌లో 4,4,6తో 15 రన్స్‌ రాబట్టిన ఇషాన్‌, ఆ వెంటనే నరైన్‌ ఓవర్‌లోనూ 4,6తో ఆకట్టుకున్నాడు. అయితే ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఇషాన్‌ను నరైన్‌, రోహిత్‌ను మరో స్పిన్నర్‌ వరుణ్‌ వరుస ఓవర్లలో అవుట్‌ చేయడంతో పతనం ఆరంభమైంది. సూర్యకుమార్‌ (11), కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ సమయంలో రన్‌రేట్‌ పెరిగిపోవడంతో ఒత్తిడికి లోనైన హార్దిక్‌ (2), డేవిడ్‌ (0) వికెట్లను చేజార్చుకున్నారు. 14వ ఓవర్‌లో తిలక్‌ 4,6,4తో 16 రన్స్‌.. 15వ ఓవర్‌లో నమన్‌ (17) 6,6,4తో 19 రన్స్‌ అందించారు. దీంతో 6 బంతుల్లో 22 పరుగులు కావాల్సి ఉండగా.. పేసర్‌ హర్షిత్‌ తొలి మూడు బంతుల్లోనే నమన్‌, తిలక్‌ వికెట్లు తీసి షాకిచ్చాడు.


ఆదుకున్న వెంకటేశ్‌: టాస్‌ కోల్పోయి కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగగా.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు సాల్ట్‌ (6), నరైన్‌ (0) తొలి రెండు ఓవర్లలోనే వెనుదిరిగారు. పేసర్లు తుషార, బుమ్రా ఈ వికెట్లు తీశారు. అటు వెంకటేశ్‌ అయ్యర్‌ మాత్రం ఎదురుదాడితో బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. వేగంగా పరుగులు సాధించాలన్న లక్ష్యంతో బ్యాటింగ్‌ సాగించి రెండు కీలక భాగస్వామ్యాలు అందించాడు. నాలుగో ఓవర్‌లో అతడు 4,6,4తో 15 రన్స్‌ సమకూర్చాడు. కెప్టెన్‌ శ్రేయాస్‌ (7) ఐదో ఓవర్‌లోనే అవుట్‌ కావడంతో మూడో వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక సీజన్‌లో తొలిసారి స్థానం దక్కించుకున్న నితీశ్‌ రాణా వేగం కనబరుస్తూ ఎనిమిదో ఓవర్‌లో 4,6తో ఆకట్టుకున్నాడు. తర్వాతి ఓవర్‌లోనే వెంకటేశ్‌ను స్పిన్నర్‌ చావ్లా దెబ్బతీశాడు. ఐదో వికెట్‌కు వీరు 37 పరుగులు అందించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన రస్సెల్‌ కూడా వేగంగా ఆడుతూ చావ్లా ఓవర్లలో భారీ షాట్లతో చెలరేగాడు. అయితే 12వ ఓవర్‌లో రెండు ఫోర్లతో జోరు మీదున్న రాణా.. తిలక్‌ వర్మ నేరుగా విసిరిన త్రోతో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. దీంతో ఐదో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఇక చావ్లా ఓవర్‌లో మరో సిక్సర్‌ బాదిన రస్సెల్‌ను అతడే పెవిలియన్‌కు చేర్చగా కేకేఆర్‌ 125/6తో నిలిచింది. ఆ తర్వాత రింకూ (20) క్రీజులో ఉన్నా చివరి మూడు ఓవర్లలో 32 పరుగులే సాధించగలిగింది. ఆఖరి ఓవర్‌లో బుమ్రా.. రింకూ వికెట్‌ తీయగా, అటు కోల్‌కతా 150+ స్కోరుతో ఫర్వాలేదనిపించింది.


స్కోరుబోర్డు

కోల్‌కతా: సాల్ట్‌ (సి) కాంబోజ్‌ (బి) తుషార 6, నరైన్‌ (బి) బుమ్రా 0, వెంకటేశ్‌ (సి) సూర్య (బి) చావ్లా 42, శ్రేయాస్‌ (బి) కాంబోజ్‌ 7, రాణా (రనౌట్‌/తిలక్‌ వర్మ) 33, రస్సెల్‌ (సి) కాంబోజ్‌ (బి) చావ్లా 24, రింకూ (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 20, రమణ్‌ దీప్‌ (నాటౌట్‌) 17, స్టార్క్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం: 16 ఓవర్లలో 157/7; వికెట్లపతనం: 1-6, 2-10, 3-40, 4-77, 5-116, 6-125, 7-148; బౌలింగ్‌: తుషార 3-0-31-1, బుమ్రా 4-0-39-2, కాంబోజ్‌ 3-0-24-1, హార్దిక్‌ 3-0-32-0, చావ్లా 3-0-28-2.

ముంబై: ఇషాన్‌ (సి) రింకూ (బి) నరైన్‌ 40, రోహిత్‌ (సి) నరైన్‌ (బి) వరుణ్‌ 19, సూర్యకుమార్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) రస్సెల్‌ 11, తిలక్‌ వర్మ (సి) సాల్ట్‌ (బి) హర్షిత్‌ 32, హార్దిక్‌ (సి) వైభవ్‌ (బి) వరుణ్‌ 2, డేవిడ్‌ (సి) శ్రేయాస్‌ (బి) రస్సెల్‌ 0 నేహల్‌ (రనౌట్‌/స్టార్క్‌-సాల్ట్‌) 3, నమన్‌ ధిర్‌ (సి) రింకూ (బి) హర్షిత్‌ 17, కాంబోజ్‌ (నాటౌట్‌) 2, చావ్లా (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం 16 ఓవర్లలో 139/8;వికెట్లపతనం : 1-65, 2-67, 3-87, 4-91, 5-92, 6-117, 7-136, 8-137 ; బౌలింగ్‌ : వైభవ్‌ 2-0-16-0, స్టార్క్‌ 1-0-11-0, హర్షిత్‌ 3-0-34-2, నరైన్‌ 3-0-21-1, వరుణ్‌ 4-0-17-2, రస్సెల్‌ 3-0-34-2.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

కోల్‌కతా 12 9 3 0 18 1.428

రాజస్థాన్‌ 11 8 3 0 16 0.476

హైదరాబాద్‌ 12 7 5 0 14 0.406

చెన్నై 12 6 6 0 12 0.491

ఢిల్లీ 12 6 6 0 12 -0.316

లఖ్‌నవూ 12 6 6 0 12 -0.769

బెంగళూరు 12 5 7 0 10 0.217

గుజరాత్‌ 12 5 7 0 10 -1.063

ముంబై 13 4 9 0 8 -0.271

పంజాబ్‌ 12 4 8 0 8 -0.423

1

టీ20 క్రికెట్‌లో అత్యధిక డకౌట్లు (44) అయిన బ్యాటర్‌గా సునీల్‌ నరైన్‌

Updated Date - May 12 , 2024 | 02:20 AM