కోల్‌కతా టాప్‌షో
ABN , Publish Date - Mar 30 , 2024 | 04:13 AM
కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి మరో అదిరిపోయే ప్రదర్శన. టాపార్డర్‌లో వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50), ఓపెనర్లు సునీల్ నరైన్ (22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 47), ఫిలిప్ సాల్ట్ (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) తుఫాన్ ఇన్నింగ్స్‌తో....
నేటి మ్యాచ్
లఖ్‌నవూ X పంజాబ్, రాత్రి 7.30 గం. నుంచి
అదరగొట్టిన వెంకటేశ్, నరైన్
బెంగళూరు ఓటమి
విరాట్ పోరాటం వృధా
బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి మరో అదిరిపోయే ప్రదర్శన. టాపార్డర్‌లో వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50), ఓపెనర్లు సునీల్ నరైన్ (22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 47), ఫిలిప్ సాల్ట్ (20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) తుఫాన్ ఇన్నింగ్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించారు. దీంతో భారీ ఛేదనను అలవోకగా ముగిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై 7 వికెట్లతో భారీ విజయం సాధించింది. అలాగే తాజా సీజన్‌లో హోం గ్రౌండ్‌లో ఓడిన తొలి జట్టుగా ఆర్‌సీబీ నిలవగా, ఈ మైదానంలో నైట్‌రైడర్స్‌కిది వరుసగా ఆరో విజయం. విరాట్ కోహ్లీ (59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 నాటౌట్) ఒక్కడే రాణించడంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33) ఫర్వాలేదనిపించాడు. రస్సెల్, హర్షిత్ రాణాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో కోల్‌కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి గెలిచింది. శ్రేయాస్ అయ్యర్ (39 నాటౌట్) సత్తా చాటాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నరైన్ నిలిచాడు.
బాదుడే బాదుడు: ఛేదన కోసం బరిలోకి దిగిన కేకేఆర్ పరుగుల ప్రవాహం తొలి బంతి నుంచే సాగింది. ఆర్సీబీ బౌలర్లు తమ సొంత మైదానంలోనూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. వైశాక్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేయగలిగాడు. ఓపెనర్లు నరైన్, సాల్ట్ ధాటిగా ఆడేస్తూ పవర్‌ప్లేలోనే ఏకంగా 85 పరుగులు సాధించారు. ఇది ఆ జట్టు తరఫున రెండో అత్యధికం. చాలా రోజుల తర్వాత నరైన్ తన బ్యాట్ పవర్ చూపించగా, అటు సాల్ట్ తొలి ఓవర్‌లోనే 6,4,6తో 18 పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో నరైన్ మూడో ఓవర్‌లో రెండు సిక్సర్లతో అలరించాడు. దీంతో 21 బంతుల్లోనే జట్టు 50 పరుగులకు చేరింది. ఆరో ఓవర్‌లో నరైన్ మరింత విజృంభిస్తూ 4,6,6 బాదేయడంతో 21 పరుగులు వచ్చాయి. అయితే హాఫ్ సెంచరీ ఖాయమని భావించిన నరైన్‌ను మయాంక్ దాగర్ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 39 బంతుల్లో 86 పరుగుల మెరుపు భాగస్వామ్యం ముగిసింది. ఆ వెంటనే సాల్ట్‌ను వైశాక్ అవుట్ చేసినా వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ ఆటలో వేగం తగ్గలేదు. తొమ్మిదో ఓవర్‌లోనే స్కోరు వంద పరుగులకు చేరగా.. అటు అయ్యర్‌ఆటలో వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలనే కసి కనిపించింది. దీంట్లో భాగంగా అల్జారి ఓవర్‌లో 6,4,6,4తో 20 పరుగులు రాబట్టాడు. అటు కెప్టెన్ శ్రేయాస్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సహకరించాడు. 14 ఓవర్లలోనే స్కోరు 150కి చేరడంతో ఆర్సీబీ ఓటమి ఖరారైంది. 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన వెంటనే వెంకటేశ్‌ను యష్ దయాల్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి 29 బంతుల్లో 16 పరుగులే కావాల్సి ఉండగా.. శ్రేయాస్, రింకూ (5 నాటౌట్) మరో 19 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు.
విరాట్ అజేయ ఇన్నింగ్స్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి శుభారంభం దక్కకపోయినా విరాట్ మెరుపు ఇన్నింగ్స్‌తో తుది కంటా నిలిచి జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డాడు. అతడికి గ్రీన్, మ్యాక్స్‌వెల్ (28) చివర్లో దినేశ్ కార్తీక్ (20) సహకరించారు. ఇక ఈ మ్యాచ్‌లోనూ కేకేఆర్ రూ. 24 కోట్ల విలువైన బౌలర్ స్టార్క్ పూర్తిగా తేలిపోవడం గమనార్హం. ఓపెనర్ డుప్లెసి (8) రెండో ఓవర్‌లోనే వెనుదిరగ్గా, మూడో ఓవర్‌లో విరాట్ 6,4.. గ్రీన్ ఫోర్‌తో 17 రన్స్ సమకూరాయి. ఇక ఆరో ఓవర్‌లోనూ గ్రీన్ చెలరేగి వరుసగా 4,4,6తో 15 రన్స్ రాబట్టడంతో జట్టు పవర్‌ప్లేను 61 పరుగులతో ముగించింది. కానీ ఆ తర్వాత పరుగుల వేగం తగ్గింది. గ్రీన్‌ను రస్సెల్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే 12వ ఓవర్‌లో విరాట్ సిక్సర్, మ్యాక్స్‌వెల్ 4,4తో స్కోరులో కాస్త కదలిక కనిపించింది. అటు మ్యాక్స్ వరుస ఓవర్లలో ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను రమణ్‌దీప్, నరైన్ వదిలేశారు. అయితే అతడిని ఎక్కువ సేపు క్రీజులో నిలువకుండా కేకేఆర్ చూడగలిగింది. 15వ ఓవర్‌లో రింకూ క్యాచ్‌తో తను పెవిలియన్‌కు చేరాడు. తర్వాతి వరుస ఓవర్లలోనే రజత్ (3)ను రస్సెల్.. అనూజ్ (3)ను హర్షిత్ అవుట్ చేయడంతో పాటు పరుగులను కూడా కట్టడి చేశారు. కానీ 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ రెండు సిక్సర్లతో మురిపించాడు. అలాగే ఆఖరి ఓవర్‌లోనూ విరాట్, డీకే చెరో సిక్సర్‌తో ఆర్‌సీబీ స్కోరు 180 దాటింది.
స్కోరుబోర్డు
బెంగళూరు: విరాట్ కోహ్లీ (నాటౌ ట్) 83, డుప్లెసి (సి) స్టార్క్ (బి) హర్షిత్ 8, గ్రీన్ (బి) రస్సెల్ 33, మ్యాక్స్‌వెల్ (సి) రింకూ (బి) నరైన్ 28, పటీదార్ (సి) రింకూ (బి) రస్సెల్ 3, అనూజ్ (సి) సాల్ట్ (బి) హర్షిత్ 3, దినేశ్ (రనౌట్) 20, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 182/6; వికెట్ల పతనం: 1-17, 2-82, 3-124, 4-144, 5-151, 6-182; బౌలింగ్: స్టార్క్ 4-0-47-0, హర్షిత్ రాణా 4-0-39-2, అనుకూల్ 2-0-6-0, నరైన్ 4-0-40-1, రస్సెల్ 4-0-29-2, వరుణ్ చక్రవర్తి 2-0-20-0.
కోల్‌కతా: సాల్ట్ (సి) గ్రీన్ (బి) వైశాక్ 30, నరైన్ (బి) దాగర్ 47, వెంకటేశ్ అయ్యర్ (సి) కోహ్లీ (బి) యష్ దయాల్ 50, శ్రేయాస్ అయ్యర్ (నాటౌట్) 39, రింకూ సింగ్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 16.5 ఓవర్లలో 186/3; వికెట్ల పతనం: 1-86, 2-92, 3-167; బౌలింగ్: సిరాజ్ 3-0-46-0, యష్ దయాల్ 4-0-46-1, అల్జారీ జోసెఫ్ 2-0-34-0, మయాంక్ దాగర్ 2.5-0-23-1, వైశాక్ 4-0-23-1, గ్రీన్ 1-0-7-0.
1
బెంగళూరు తరఫున ఎక్కువ సిక్సర్లు (241)బాదిన బ్యాటర్‌గా కోహ్లీ. గేల్ (239)ను దాటాడు.
4
టీ20ల్లో 500 మ్యాచ్‌లు పూర్తి చేసిన నాలుగో క్రికెటర్‌గా సునీల్ నరైన్. పొలార్డ్ (660), బ్రావో (573), షోయబ్ మాలిక్ (542) ముందున్నారు.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
చెన్నై 2 2 0 0 4 1.979
కోల్‌కతా 2 2 0 0 4 1.047
రాజస్థాన్ 2 2 0 0 4 0.800
హైదరాబాద్ 2 1 1 0 2 0.675
పంజాబ్ 2 1 1 0 2 0.025
బెంగళూరు 3 1 2 0 2 -0.711
గుజరాత్ 2 1 1 0 2 -1.425
ఢిల్లీ 2 0 2 0 0 -0.528
ముంబై 2 0 2 0 0 -0.925
లఖ్‌నవూ 1 0 1 0 0 -1.000
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్