KL Rahul: జట్టులో 11 మంది విఫలమవుతారా... రాహుల్‌తో స్టేడియంలో వాగ్వాదంపై సంజీయ్ గోయెంకా స్పందన..
ABN , Publish Date - Aug 30 , 2024 | 06:55 PM
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్‌లో కేఎల్ రాహుల్ కొనసాగడంపై ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పరోక్షంగా స్పందించారు. అలాగే తాజా సీజన్‌లో జట్టు వైఫల్యానికి కేఎల్ రాహుల్ తీసుకున్న నిర్ణయాలే కారణమని పరోక్షంగా చెబుతూ, మెంటార్‌గా గంభీర్ లేకపోవడం పెద్ద లోటని అన్నారు.
గత సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ (LSG) ఓటమికి కేఎల్ రాహుల్ నాయకత్వ వైఫల్యమే కారణమని ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) పరోక్షంగా అన్నారు. 2023 సీజన్‌లో జట్టు వైఫల్యానికి కేఎల్ రాహుల్ (KL Rahul) తీసుకున్న నిర్ణయాలే కారణమని పరోక్షంగా చెబుతూ, మెంటార్‌గా గంభీర్ లేకపోవడం పెద్ద లోటని అన్నారు. తాజాగా ఆయన ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్‌ఎస్‌జీ గురించి మాట్లాడారు. తమ జట్టుకు మెంటార్‌గా జహీర్‌ఖాన్ (Zaheer Khan)ను ఎందుకు తీసుకున్నారో వివరించారు.
అలాగే ఈ ఏడాది సీజన్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోపై కూడా మాట్లాడారు. ``మేం ఈరోజు చాలా చెత్తగా ఆడాం అని ఆటగాడు వచ్చి చెబితే నాకు నచ్చదు. అలాంటిది వరుసగా అదే సమాధానం చెబితే ఎలా ఉంటుంది. దానికి కారణమేంటో నాకు తెలియాలి కదా. జట్టులో ఒకరు విఫలమైతే అర్థం చేసుకోగలం. మొత్తం జట్టంతా వరుస మ్యాచ్‌ల్లో విఫలమైతే ఏం చేయాలి. గెలవాలనే స్ఫూర్తి ఉండాలి. మెంటార్‌గా గంభీర్ లేని లోటు కనిపించింది`` అని గోయెంకా అన్నారు.
అలాగే గంభీర్ తరహాలోనే జహీర్ ఖాన్ కూడా ఎల్‌ఎస్‌జీని గాడిలో పెట్టగలడని గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు. ``విజయం కోసం తపించే బ్రెయిన్ ఈ సీజన్‌లో లోపించింది. అందుకే విజయాలు లభించలేదు. విజయమే లక్ష్యంగా పని చేసే వాళ్లు కావాలి. అతడు మెంటార్ అవనివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి. అలాంటి వ్యక్తి జహీర్ ఖాన్. ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా అతడు విజయం అంకిత భావంతో కృషి చేసేవాడు. కీలక నిర్ణయాలు తీసుకుని జట్టును విజయపథాన నడిపిండచంలో జహీర్ ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను`` అంటూ సంజీవ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Paralympics 2024: గుడ్ న్యూస్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు వరుస పతకాలు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..