Share News

Paralympics 2024: గుడ్ న్యూస్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు వరుస పతకాలు

ABN , Publish Date - Aug 30 , 2024 | 06:24 PM

ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్ పోటీలో మనీష్ నర్వాల్ రజతం గెల్చుకున్నాడు. మరోవైపు మహిళల 100 మీటర్ల (టీ35) రేసులో భారత్‌కు చెందిన ప్రీతీ పాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

Paralympics 2024: గుడ్ న్యూస్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు వరుస పతకాలు
Paralympics 2024 india medals

ప్యారిస్ పారాలింపిక్స్‌(Paris Paralympics 2024)లో భారత్‌కు నాలుగో పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌లో మనీష్ నర్వాల్(Manish Narwal) రజత పతకాన్ని గెలుచుకున్నాడు. వరుసగా రెండో పారాలింపిక్స్‌లో మనీష్ పతకం సాధించడం విశేషం. గత పారాలింపిక్స్‌లో మనీష్ 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్‌లో కొరియాకు చెందిన జియోంగ్డు ఫైనల్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. అతను 237.4 సాధించాడు. కాగా నర్వాల్ 234.9 స్కోర్‌తో రెండో స్థానంలో నిలిచాడు. చైనాకు చెందిన యాంగ్ చావో 214.3 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ కు వచ్చిన మొత్తం పతకాల సంఖ్య నాలుగుకి చేరింది.


తొలి భారతీయురాలిగా

ఇదే క్రీడల్లో మహిళల 100 మీటర్ల (టీ35) రేసులో భారత్‌కు చెందిన ప్రీతీ పాల్(Preeti Pal) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 100 మీటర్ల దూరాన్ని 14.31 సెకన్లలో అధిగమించిన క్రమంలో ఈ ఛాన్స్ దక్కింది. 23 ఏళ్ల ప్రీతి మహిళల 100 మీటర్ల టీ35 ఫైనల్లో మూడో స్థానంలో నిలిచింది. దీంతో పారాలింపిక్స్‌లో ట్రాక్ ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ఈరోజు తెల్లవారుజామున, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 ఫైనల్ ఈవెంట్‌లో అవనీ లేఖరా బంగారు పతకాన్ని గెలుచుకోగా, మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.


ఈవెంట్‌లో

ఈ ఈవెంట్‌లో చైనాకు చెందిన గువో కియాన్‌కియాన్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె 13.74 సెకన్లలో రేసును పూర్తి చేయగా, చైనాకు చెందిన హి జౌ 1.58 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రీతి సాధించిన కాంస్య పతకం పారిస్ పారాలింపిక్స్ పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం. హైపర్టోనియా, అటాక్సియా, అథెటోసిస్, సెరిబ్రల్ పాల్సీ మొదలైన కోఆర్డినేషన్ డిజార్డర్స్ ఉన్న పారా అథ్లెట్లను పారాలింపిక్ గేమ్స్‌లో T35 కేటగిరీలో చేర్చుతారు.


ప్రీతికి ఈ సంవత్సరం

ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రీతీ పాల్ అద్భుతాలు చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మార్చి 2024లో బెంగుళూరులో జరిగిన 6వ ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించి ప్రీతీ ఈ ఏడాదిని అద్భుతంగా ప్రారంభించింది. ఆ తరువాత ఆమె మే నెలలో జపాన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మూడవ స్థానం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ పతకం కారణంగానే ప్యారిస్ పారాలింపిక్స్‌లో స్థానం దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు కాంస్య పతకం సాధించి మళ్లీ రికార్డు సృష్టించింది.


ఇవి కూడా చదవండి:

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌ షూటింగ్‌లో స్వర్ణం, కాంస్యం గెలిచిన భారత్


Vistara: ప్రయాణికులకు అలర్ట్.. ఈ విమాన టిక్కెట్స్ బుకింగ్ బంద్


Narendra Modi: గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ.. కరెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు


Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త

Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం


Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 06:29 PM